డాక్టర్ కె.జానకి గారి పుస్తకం"రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఫ్రీడం స్ట్రగుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్"
==============================================================
దేశ స్వాతంత్య్రంకోసం పురుషులతో పాటు స్త్రీలుకూడా ముందుకుదూకారు. 1940_41 మధ్య కాలంలో అలా వ్యక్తిగతపోరాటాలు చేసిన కొందరు మగువలగూర్చి తెల్సుకుందాం! కాకినాడ కి చెందిన జగదాంబ తండ్రి డాక్టర్.ఎం.వి.వీరయ్య. జగదాంబ ఏప్రిల్ 1919లో పర్లాకిమిడిలో పుట్టారు.సంఘసేవిక గా,యుద్ధవ్యతిరేకిగా ప్రచారం చేసిన ఆమెను 1940లో అడ్డుకున్నది ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం.ట్రేడ్ యూనియన్ మూవ్ మెంట్ లో చురుగ్గా పాల్గొన్నారు.1947లో రాజమండ్రి మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నారు జగదాంబ.
గోళ్లమూడి పాడు నివాసి ఉప్పల అన్నపూర్ణమ్మ తండ్రి కొనగల రామయ్య, భర్త వీరయ్య. 1940లో సత్యాగ్రహంలో పాల్గొన్నా అరెస్ట్ కాలేదు. వాసిరెడ్డి హనుమాయమ్మ1910లో పుట్టి
చేబ్రోలు లో నివసించారు .దేవభక్తుని వీరయ్య ఈమె తండ్రి.కోటయ్య భర్త. యుద్ధానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారామె.కొడాలి కమలమ్మ మోపర్రువాసి.తండ్రి గోగినేని రామకోటయ్య, భర్త కుటుంబరావు. ఉన్నవ లక్ష్మీబాయమ్మ5మార్చి 1941లో వెల్లూరుజైలుశిక్ష అనుభవించారు.గుంటూరు కి చెందిన జి.లక్ష్మమ్మ కి జైలుశిక్ష విధించింది గుంటూరు సబ్ డివిజనల్ మాజిస్ట్రేట్.సత్తెనపల్లి చెందిన వావిలాల మాణిక్యాంబ భర్త రామశర్మ1930నుంచి ఫ్రీడంఫైటర్! మాణిక్యాంబ 30జనవరి 1941 లో వెల్లూర్ కడప జైలుశిక్ష అనుభవించారు.
చుక్కపల్లి మాణిక్యాంబ కంచర్లపాలెంకి చెందిన బొల్లినేని కోటయ్య గారి కుమార్తె.భర్త చుక్కపల్లి కోటయ్య. 30జనవరి1941లో వెల్లూర్,కడపజైళ్లలో గడిపారుఆమె.వందెనపు నాగలక్ష్మి గుంటూరువాసి సాంబమూర్తిగారి భార్య. ఆమె టీచర్ గా పనిచేస్తూ సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు3ఫిబ్రవరి 1941లో వెల్లూరు,కడపజైళ్లలో ఉన్నారు. గుంటూరుకు చెందిన బసవరాజు రాజ్యలక్ష్మి గారిభర్త అప్పారావుగారు కవి .3ఫిబ్రవరి1941లో ఈమెవెల్లూరు కడపజైళ్లలో గడిపారు.సూర్య దేవర రాజ్యలక్ష్మమ్మ ఇండివిడ్యువల్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు.సూర్య దేవర రాజ్యలక్ష్మీ దేవి1941లో వెల్లూరులో జైలుశిక్ష అనుభవించిన మగువ.ఇక గోళ్లమూడి రత్నమ్మ ఇంకా మునగపాటి రామకోటిపున్నమ్మకి 12జులై2941 నుంచి అక్టోబర్ 11 దాకా వెల్లూరుజైలుశిక్ష విధింపబడింది.సాతుబిర్(నరసరావుపేట) కిచెందిన ఈమె భర్త శ్రీ హనుమయ్య 🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి