నేటి అంశం : సమస్య
“మీసములున్న భామలు..??
నా పూరణ ప్రయత్నము
ఉత్పలమాల:
మీసము మేఘ వర్ణమున మేదురమై, మెలిపెట్ట ధీరతన్
రోసము జూపు వేళన మరోపరి శ్మశ్రువు లన్ స్పృశించు వి
న్యాసము జూసి మోజుపడి నాతియె మీసము కోరె నక్కటా!
మీసములున్న భామలకు మేలు గదా సకలార్ధముల్ గనన్
మేదురము = చిక్కని, దట్టమైన
మరోపరి = మరొక సారి
శ్మశ్రువు = మీసము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి