మరుగున పడిన మగువలు12: - సేకరణ....అచ్యుతునిరాజ్యశ్రీ
 
డాక్టర్ కె.జానకి గారి పుస్తకం"రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఫ్రీడం స్ట్రగుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్"
మోపర్రు కి చెందిన కల్లూరు తులశమ్మ తండ్రి కొడాలి కృష్ణయ్య. భర్త రంగయ్య ప్రోత్సాహంతో 1940లో వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొన్న ఆమెను అరెస్ట్ చేయలేదు.అలాగే కూచిపూడి ఉషాదేవి కూడా పాల్గొన్నాకూడా అరెస్ట్ కాలేదు.ఆమె తండ్రి జాస్తి శ్రీరాములు,భర్త  మునీశ్వరరావు. రావెళ్ల వెంకాయమ్మ,అయ్యదేవర బాలా త్రిపుర సుందరమ్మ,కొల్లిపర లక్ష్మికాంతమ్మ, ఇలా పాల్గొన్నవారే! వాసిరెడ్డి అఖిలాండేశ్వరి1917 లో చేబ్రోలులో పుట్టారు.తండ్రి పోతిన నారాయణస్వామి,భర్త  చిట్టి అలియాస్ అప్పలస్వామి. ఆమెకు 500రు. ఫైన్, వెల్లూరుజైలుశిక్ష పడింది.గోనుగుంట్ల లక్ష్మీనరసమ్మ కి18.6.1941 లో50రు. ఫైన్,వేస్తే కట్టి18జులై 1941 లో విడుదలైంది.16 సెప్టెంబర్ 1941లో 6నెలల జైలుశిక్ష పడి డిసెంబర్ 11,  1941 లో వెల్లూర్ జైలు నించి విడుదలైంది.వల్లభనేని సీతామహలక్ష్మికి 300రు.ఫైన్,తో19.3.1941లో వెల్లూరుజైలుశిక్ష పడింది. వెక్కలగడ్డ (దివి ) కి చెందిన మల్లంపాటి రత్నమాణిక్యం 1926లో పుట్టారు.ఆమె భర్త నాగభూషణవర్మ.తన 15వ ఏట భర్తతో పాటు1941లో ఉద్యమంలో పాల్గొన్నది.మైనర్ కావటంతో అరెస్ట్ చేయలేదు.
గుళ్లపల్లి సీతారామమ్మ గొడవర్రు నివాసి.తండ్రి వెంకయ్య.23జులై1941నుంచి
 _23అక్టోబర్ 1941 దాకా వెల్లూర్ జైల్లో ఉంది.బెజవాడ లక్ష్మికాంతమ్మ 4ఫిబ్రవరి1921లో బుచ్చిరెడ్డిపాలెంలో పుట్టింది.తండ్రి తిక్కవరపు రామిరెడ్డి.భర్త బెజవాడ గోపాలరెడ్డి.శాంతినికేతన్ లో ఇంటర్మీడియట్ చదివిన ఆమె సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు4.3.1941లో 3నెలల జైలుశిక్ష  500రు.ఫైన్ వేశారు.వెల్లూరుజైలుశిక్ష  అనుభవించింది.వెంకటగిరి కి చెందిన  కొబాక రుక్మిణమ్మ  భర్త  సుబ్బయ్య. 10జనవరి 1941 _9ఏప్రిల్ 1941 దాకా కన్ననూర్,వెల్లూరు జైళ్లలో గడిపిందామె🌹

కామెంట్‌లు