ఆకాశవాణి సమాచారం12: -సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ
 డాక్టర్.నాగసూరివేణుగోపాల్  సిగ్నేచర్ ట్యూన్ పుస్తకం నుంచి
ఆంధ్రభారతి అనే పత్రికలో 1910లో గురజాడ వారి దిద్దుబాటు కథానిక ప్రచురింపబడింది.సెప్టెంబర్ 20 నుంచి 1 అక్టోబర్ దాకా 12కథలు 12ఆకాశవాణికేంద్రాలనుంచి రాత్రి 8.15కి ప్రసారం కావటం ఓమలుపు.2009_2010లో హైదరాబాద్ కేంద్ర వజ్రోత్సవం 60ఏళ్ల పండగ లో తెలుగుప్రముఖుల భాషాప్రసంగాలు అందరినీ అలరించాయి.రేడియోసంగీతసమ్మేళనం 1954లో,సర్దార్ మెమోరియల్ లెక్చెర్స్ 1955లో,జాతీయ సర్వభాషాకవిసమ్మేళనం 1956లో మొదలైనాయి.శ్రీనాగసూరిగారు చేసిన కార్యక్రమం 1 జనవరి 2012 నుంచి 15 దాకా ప్రతిరోజు రాత్రి 8.15 కి ఆకాశవాణి సంక్రాంతి కథోత్సవం2012 రక్తికట్టింది.కొత్త బాటవేసింది. 2010 ఉగాదితో మొదలైన మనతెలుగు సీరియల్ ని దాదాపు 9నెలలు నిర్వహించారు వేణుగోపాల్ గారు."మన తెలుగు" పుస్తక ప్రచురణ కి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు నడుంబిగించారు.కానీ రాష్ట్రం రెండుగా విడిపోటంతో ప్రచురణ ఆగిపోవటం, నాగసూరిగారికి మద్రాస్ ట్రాన్స్ఫర్ కావటంతో దానిజాడలేదు.కానీ ఎమెస్కో ద్వారా  మండలివారు పుస్తకం అచ్చేయించారు.2015లో 15మందిప్రముఖుల వ్యాసాలతో 300పేజీల మనతెలుగు వెలుగుచూసింది.అందులో ఓవిశేషం ఏమంటేశ్రీ సి.రాఘవాచారిగారి ప్రసంగాలనుశ్రీమతి పింగళి ప్రమీలగారు స్వచ్ఛందంగా రాతరూపంలో అందించారు.2000లో సమస్యాపూరణం ప్రోగ్రాంకి ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు వేణుగోపాల్ గారు .డా.ప్రసాదరాయకులపతిగారు( కుర్తాళం పీఠాధిపతి) తమ శ్రీనాధపీఠంలో పండితులు శ్రోతల కు తగిన ఏర్పాట్లు చేయటం,  విజయవాడ ఆకాశవాణి సమస్యాపూరణంలో ఢంకా బజాయించటం జరిగింది.ఇది పద్యోద్దీపనం గా నిలిచిన ప్రోగ్రాం🌹

కామెంట్‌లు