ఆకాశవాణి సమాచారం 13: -సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ

 డా.నాగసూరివేణుగోపాల్ సిగ్నేచర్ ట్యూన్ పుస్తకంనుంచి
వేణుగోపాల్ గారు చేసిన గొప్ప కార్యక్రమం అన్నమయ్య పదగోపురం 2013 మే నెల లో కడప ఆకాశవాణినుంచి మొదలైన గొప్ప శిఖరం!దానికి బీజం అబ్బూరిగోపాలకృష్ణ గారి పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథం!కె.వి.రమణాచారిగారు  టి.టి.డి.ని ఒప్పించి స్పాన్సర్షిప్ సాధించి పెట్టారు. ఆకాశవాణికి రాబడి వచ్చింది.కానీ నాగసూరిగారికి మద్రాస్ బదిలీకావటంతో ఇబ్బందిపడినా ఆప్రోగ్రాం ఢంకా బజాయించింది.మద్రాస్ నుంచి ఆయన,  కడపనుంచి మంజులాదేవి  శ్రమ కోర్చి 6నెలలపాటు నడపటం గ్రేట్! అందులో హేమాహేమీలు సర్వశ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్,నేదునూరి, రవ్వాశ్రీహరి, కామిశెట్టి శ్రీనివాసులు. ..ఎందరో మహానుభావులతో పలుకేంద్రాల్లో ప్రసారమైంది.ఆకాశవాణి అధికారికంగా ఆలిండియా రేడియో1995 అనే ప్రచురణ వెలువరించింది. 1995మార్చి 31నాటికి 24భాషలు, 146మాండలిక భాషల ప్రోగ్రాములున్నాయి.కొన్నిటికి లిపి ఉండదు.కానీ రేడియోలో సంభాషణ రూపంలో కొత్త ప్రోగ్రాంచేశారు. 1995లో*రోంత ఇనిపోప్పా* అనే 5_6నిముషాల సంభాషణ ను అనంతపురం మాండలికంతో అక్కడి స్థానిక గొంతులతో వినిపించటం ఓప్రయోగం! అనంతపురంజిల్లాకు చెందిన  విద్వాన్ విశ్వం పెన్నేటిపాట కావ్యసృజనచేస్తే, దాశరథిగారిపూనికతో 1956లో తెలంగాణ రచయితల సంఘం హైదరాబాద్ ప్రచురించింది.2017లో తిరుపతి ఆకాశవాణిలో శ్రీభూమన్ తో నాగసూరిగారు ఓ అరగంట  ఇంటర్వ్యూ చేసి తర్వాత  5_6ఎపిసోడ్స్ లో భూమన్ పెన్నేటి కావ్యాన్ని పఠించటం జరిగింది. పెన్నేటి కతలు 2013లో కడపకేంద్రంలో రికార్డు చేశారు.అవి మద్రాసు,తిరుపతిలో పునఃప్రసారం ఐనాయి.బడ్జెట్ స్టాఫ్ కొరత తో  తను అనుకున్న పనులు చేయలేక పోయానని నాగసూరిగారు స్పష్టంగా రాశారు.షార్ట్ అండ్ స్వీట్ ప్రోగ్రాం మద్రాసు ఆకాశవాణిలో 26నెలలు *మల్లెపూదండ*తో ఘుమఘుమలాడించారు వేణుగోపాల్ గారు.శంకరంబాడి సుందరాచారిగారు రాశారు దీనబంధు  అనేసినిమాకోసం(1942).కానీ వారు వినియోగించుకోలేదు.టంగు ప్రకాశంపంతులుగారి తమ్ముడికూతురు సూర్య కుమారి హెచ్.ఎం.వి.కి పాడటం అదిజనాల్లోకి చొచ్చుకుపోటంతో  దాన్నే శీర్షిక గా పెట్టుకుని కదంబ కార్యక్రమాలు పిల్లలు,మహిళలకు గూడా ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించారు.2014నుంచి 45నిముషాల వెరైటీ ప్రోగ్రాంని ఘనచరిత్రగా వెన్నెల తోరణంగా నిర్వహించిన నాగసూరిగారు అందరి అభిమానాన్ని పొందారు🌹
కామెంట్‌లు