డా.నాగసూరివేణుగోపాల్ సిగ్నేచర్ ట్యూన్ పుస్తకంనుంచి
తను జీవితంలో నేర్చుకున్న నిత్య సత్యాలను శ్రీనాగసూరిగారు ఇలా చెప్పారు" చదవడం,తెలుసుకోవడం,పర్యటించడం, కలవడం,అధ్యయనం చేయడం,శ్రమించడం".నామ్ కే వాస్తే ఉద్యోగంచేసి జీతంతీసుకు లైఫ్ ఎంజాయ్ చేయడంలో మజా ఉండదు.ఇతరులకి కొత్త ది చెప్పాలి,నలుగురికి ఉపయోగ పడాలి అనేదే ప్రతివారూ వృత్తిధర్మంగా భావిస్తే ఆజీవితం సార్ధకం.30మే 2013 లో మద్రాస్ ఆకాశ కేంద్రంలో చేరినపుడు మండలిబుద్ధప్రసాద్ గారితో కలిసి వేణుగోపాల్ గారు మేళత్తూర్ వెళ్లారు.అది తిరువయ్యూర్ కి 5_6కి.మీ.దూరం! త్యాగయ్య కి సమకాలీనుడైన మేళత్తూర్ వెంకట్రామశాస్త్రి 11 తెలుగు నాట్యనాటకాలు రాశారు.ఆయన తండ్రి గోపాలకృష్ణయ్య,కూచిపూడి సిద్ధేంద్ర యోగి నారాయణ తీర్ధులవారి శిష్యులని అంటారు.విజయనగరపాలకుడైన అచ్యుతరాయలు 500మంది బ్రాహ్మణులకు ఇచ్చిన ప్రాంతమే మేళ(ఉన్నత)త్తూర్ గా ప్రసిద్ధిగాంచినది.అలా ఆశ్రయంపొందిన బ్రాహ్మణులు సంగీత సాహిత్య నాట్యాలకి పేరుగాంచారు వెంకట రామశాస్త్రి విరచిత మేళత్తూర్ నాట్యనాటకాలు భాగవతమేళాగా ప్రసిద్ధిగాంచాయి.తెలుగు రచనలు తమిళంలో రాసుకుని తమిళయాసతో ప్రహ్లాదజయంతికి రెండురోజులు ప్రదర్శించడం ఆనవాయితీగా మారింది. మద్రాస్ ఆకాశవాణికి మంచి ఆడిటోరియం ఉండటంతో స్టేషన్ డైరెక్టర్ శ్రీసుబ్రమణ్యంగారి చేయూత తో2015లో సంక్రాంతికి తెలుగువిభాగం తరుఫున జనవరి12 సాయంత్రం 6గంటలకి తొలిసారి మేళత్తూర్ భాగవత మేళాను వేదిక పై ప్రదర్శింపజేయటం ఓరికార్డు అని చెప్పొచ్చు.అది ఆడియో 2భాగాలుగా జనవరి 14,15 న ఉదయం 8.15కి మద్రాస్ బి కేంద్రం ప్రసారంచేయటం,మద్రాస్ ఎఫ్.ఎం. గోల్డ్ ఛానల్ లో ఉదయం 11 కి పునఃప్రసారంకావటం ఓరికార్డ్! ప్రహ్లాదచరిత్రం ని తెలుగు,దేవనాగరిలిపిలో మహాలింగంగారు ప్రచురించారు. వీరి ప్రదర్శన లోసంగీతం నృత్యం ప్రధానం వచనం దాదాపు ఉండదు. కానీ శాలియమంగళం ప్రదర్శనలో వచనం ఎక్కువ. భక్తప్రహ్లాద సినిమాలో ఎస్వీ.రంగారావు,రోజారమణి నటనలో ఈఛాయలున్నాయి.2017లో మహాలింగంగారిమార్కండేయచరిత్ర ఆవిష్కరణ సభలో వేణుగోపాల్ గారు పాల్గొన్నారు.10మే 2017లో ఉదయం 11కి 12 తెలుగు ఆకాశవాణి కేంద్రాలు ఓగంట మేళత్తూర్ ప్రహ్లాద చరిత్రను ప్రసారంచేయటం,శ్రీ కుప్పుస్వామి ప్రాయోజితం చేయటంవల్ల ఆకాశవాణికి లక్ష రూపాయలపైగా లాభం చేకూరి టం విశేషం! ఇక ఆకాశవాణి ద్వారా సినీ నేపధ్యగాయకులు ప్రసిద్ధి కెక్కారు. ఘంటసాల సుశీల ప్రముఖులు.రత్న కుమార్ క్యాజువల్ ఎనౌన్సర్ గా,ఎస్.పి.వసంత లక్ష్మికూడా క్యాజువల్ ఎనౌన్సర్ గా మద్రాస్ ఆకాశవాణిలో పనిచేశారు🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి