డా.నాగసూరివేణుగోపాల్_సిగ్నేచర్ ట్యూన్ పుస్తకంనుంచి
శ్రీనాగసూరిగారు చేసిన ఇంకో ప్రోగ్రాం "నాటిపత్రికలు మేటివిలువలు" అనే శీర్షికతో పొత్తూరి వెంకటేశ్వర రావుగారిచేత 13 ప్రసంగాలు రికార్డుచేయించారు.ఆయన హైదరాబాద్ నుంచి సొంతూరు పొత్తూరు కివస్తే, ఆటైంలో రేడియోస్టేషన్ కి తీసుకెళ్లి 4_5ప్రసంగాలు ఒకేసారి రికార్డు చేసేవారు.2006 లో అవన్నీ పుస్తకంగా రావటం విశేషం! అదే పొత్తూరివారి తొలి పుస్తకం.2002_04లో అనంతపురంలో "సీమకథలు" సీరియల్ గా డా.సి.పద్మావతమ్మగారు చదివారు.ఇక మద్రాసు ఆకాశవాణిలో డా.రాయదుర్గం విజయలక్ష్మిచేత"తమిళతెలుగు బతుకు కతలు" చదివించారు.2014లో పుస్తకంగా వచ్చింది.2013లో డా.సాయికృష్ణ యాచేంద్ర గారిచేత "సంగీత గేయధార" ను నిర్వహించారు. అక్కడి తెలుగు డైలీ పేపర్లు ఆకాశ వాణి విశేషాలు రోజూ ప్రచురించేవి.2014లో 13జనవరిన జలంధర,పద్మావిజయ్, గొర్లిశ్రీనివాసరావు, చిర్రావూరు మదన్మోహన్,శ్రీ విరించి(ఎన్.సి.రామానుజాచార్యులు) గార్లు సభలో చదవటం అవి 14జనవరి నుంచి ఉదయం8.15 కు మల్లెపూదండ లో ప్రసారమవటం,శ్రీ వేదగిరి రాంబాబుగారు ప్రచురించటం నిజంగా మధుర స్మృతి.ఆ5కథలు ఆణిముత్యాలుగా ఆకాశవాణిలో మెరిశాయి.ఇక నాగసూరిగారి మరోప్రయోగాన్ని గూర్చి చెప్పుకోవాలి. కార్టూనిస్టు జయదేవ్ గారు జువాలజీ లెక్చెరర్ గా చేసి రిటైరైనారు.ఆయన ఫ్రెండ్స్ రామ్మూర్తి,పురుషోత్తం,మోహన్ కృష్ణ తో కల్పి 70ఏళ్లక్రితం మద్రాసు వాషర్మన్ పేట,అలవాట్లు...ఆతర్వాత వచ్చిన మార్పులకు తోఓగంట ప్రోగ్రాం చేయటం అది ఓప్రయోగంగా నిలవటం( 4గురుమిత్రుల బాతాఖానీ) విలక్షణప్రోగ్రాం అంటారు వేణుగోపాల్ గారు.ఇది రెండు భాగాలుగా వేర్వేరు రోజుల్లో ప్రసారమైంది 🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి