తిరుపతి రామకృష్ణ మిషన్‌లో "కటకటా మర్కటా" పుస్తకావిష్కరణ- 18న
 తిరుపతి: సంస్కార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, రామకృష్ణ మిషన్ సౌజన్యంతో ప్రముఖ రచయిత శ్రీ ఆర్.సి.కృష్ణస్వామి రాజు రచించిన "కటకటా మర్కటా" (బాలల కథల సంపుటి) పుస్తకావిష్కరణ సభ ఈనెల 18వ తేదీ (సోమవారం) సాయంత్రం 5:30 గంటలకు తిరుపతిలోని రామకృష్ణ మిషన్ వివేకానంద సభాంగణంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి తిరుపతి రామకృష్ణ మిషన్ అధ్యక్షులు శ్రీ సుకృతానంద మహారాజ్ విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. సభకు గౌరవ అతిథిగా భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ రాజు, విశిష్ట అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య మధురాంతకం నరేంద్ర, ఆత్మీయ అతిథిగా కేంద్ర బాల సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ గంగిశెట్టి శివ కుమార్ హాజరుకానున్నారు.
ఈ సభలో ఎస్వీ యూనివర్సిటీ తెలుగు శాఖకు చెందిన శ్రీ జి. రమేష్ బాబు పుస్తక సమీక్ష చేయనున్నారు. సభాంతరం విచ్చేసిన వారికి అల్పాహార విందు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. తిరుపతి నగరంలోని భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ సాహిత్య కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సంస్కార్ రాజేష్, సతీష్ కుమార్ (మొబైల్: 7396447960) ఒక ప్రకటనలో కోరారు.

కామెంట్‌లు