శ్రీవేణుగోపాల్ గారు2016 మార్చి6న నింగినిపరికిద్దాం అనే ప్రోగ్రాంని దుత్తలూర్ లో నిర్వహించినపుడు 8,9 క్లాస్ బాలబాలికలు 220మంది టెలీస్కోప్ ద్వారా చూడటం ప్రశ్నలడగటం, జవాబులతో తృప్తిచెందటం ఓఅపూర్వ ప్రయోగం!నెల్లూరు జనవిజ్ఞాన వేదికప్రముఖులు,శ్రీకృష్ణ స్వామి టెలీస్కోప్ తో వివరణ ముఖ్య భూమిక పోషించాయి. 1995లో శ్రీనాగసూరిగారు న్యూఢిల్లీనుంచి ఆకాశవాణి అన్ని కేంద్రాలకు సైన్స్ కార్యక్రమాలు రూపొందించారు.ఇక తిరుపతిలో రీజినల్ సైన్స్ సెంటర్ వల్ల నెలకోసారి తారామండలం వీక్షణంని రికార్డుచేసి ప్రసారంచేయటం*దిహిందూ* వంటి డైలీపేపర్స్ ప్రముఖంగా ప్రచురించటం ,ఆకాశవాణి సిఇఓ ప్రశంసించటం మైలురాళ్లు.మ్యూజియం క్యూరేటర్ శ్రీమణికందన్ చేయూత తో పిల్లల ప్రశ్నలునిపుణుల తగిన జవాబులతో రికార్డుచేసి వ్యాఖ్యానం శ్రోతలని అలరించినదని వేరే చెప్పనవసరంలేదు.అది కొన్ని నెలలు సాగింది.తెలుగు ఆకాశవాణి చేసిన ప్రోగ్రాంగా రికార్డు సృష్టించింది.దురదృష్టవశాత్తు 59ఏళ్ల మణికందన్ కోవిడ్ తో కనుమూయటం బాధాకరం.శ్రీనాగసూరిగారు డిప్యూటేషన్ పై నేషనల్ సైన్స్ మ్యాగజైన్ కోసం(రేడియోస్కోప్) ఢిల్లీవెళ్లారు. కొన్నినెలలు మాత్రమే చేశారు🌹
ఆకాశవాణి సమాచారం19: సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి