మరుగున పడిన మగువలు20 వభాగం: -అనువాదం...అచ్యుతునిరాజ్యశ్రీ
 డాక్టర్.కె.జానకిగారిRole of women in freedom struggle in Andhra Pradesh *
ఉన్నవలక్ష్మీబాయమ్మగారు గుంటూరు జిల్లాలోని అమీనాబాద్ లో పుట్టింది.ఆమెతండ్రి నడింపల్లిసీతారామయ్య. సంఘసంస్కర్త ఉన్నవలక్ష్మీనారాయణగారి భార్య గా ఆమె సంఘసేవతో పాటు దేశంకోసం పోరాడిన వనిత. 1913లో తొలి ఆంధ్ర రాష్ట్ర సభకి(బాపట్ల) హాజరైనారామె.శారదానికేతన్ అనే విద్యాసంస్థని 1922లో బాలికల కోసం ఉన్నవ దంపతులు నెలకొల్పి వితంతువివాహాలని ప్రోత్సాహించారు.ఆంధ్రా వచ్చినప్పుడల్లా గాంధీజీ ఈసంస్థను దర్శించేవారు. 1902లో భార్యాభర్తలు గుంటూరులో వితంతువులకు వసతిగృహంని నెలకొల్పారు.రాజమండ్రీలోకూడా వితంతువసతిగృహనిర్వహణకై కందుకూరివీరేశలింగం పంతులుగారి ఆహ్వానంపై వెళ్లి కొన్నాళ్లుండి తిరిగి గుంటూరు వెళ్లిపోయారు.బాలగంగాధరతిలక్ ని ఆదంపతులు తమరాజకీయగురువుగా భావించారు.ఆచంట రుక్మిణి,లక్ష్మీపతిదంపతులతో కల్సిదేశస్వాతంత్ర్యం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగూర్చి చర్చించేవారు.పొట్లపూడిలోపొణకా కనకమ్మ గారు  ఇవి ఏర్పాటుచేసేవారు.అలా లక్ష్మీబాయమ్మగారు మగువలని తమకాళ్లపై నిలబడేలా ,దేశంకోసం పోరాడేలా తర్ఫీదు ఇచ్చారు.
శ్రీమతి ఆవులబాలనాగు గాంధీజీపిలుపుతో సమరంలో దూకినగుంటూరుజిల్లాకి చెందిన మహిళ.రాజమండ్రి జైల్లో 6.4.1922లో గడిపారు.పల్నాడుతాలూకాకి చెందిన జంగమేశ్వరం నివాసి ఆమె.కోడితాడిపర్రుకి చెందిన వేదాంతం లక్ష్మీకాంతం 2.2.1922 లో రాజమండ్రి జైల్లోగడిపారు.కాంచన పల్లి వెంకమ్మ పల్నాడువాసి 6.4.1922లోరాజమండ్రిలో జైలుశిక్ష అనుభవించిన మగువ. ఇక పల్నాడు సత్యాగ్రహంలో పాల్గొన్నవారు కోట ఆదెమ్మ, ఎర్లదర్లబాలమ్మ, మిరియాల కోటమ్మ,పొలసల కోటమ్మ,మిరియాల మంగమ్మ, పిట్టానాగమ్మ,ఏనుగుల రామమ్మ, కొండా వెంకమ్మ మొదలైన వారంతా1921_22లోపలనాడు ఫారెస్ట్ సత్యాగ్రహంలో పాల్గొన్న జైలుశిక్ష అనుభవించిన మహిళామణులు🌷

కామెంట్‌లు