డా.కె.జానకిగారి Role of women infreedom struggle in Andhra Pradesh
భారత స్వాతంత్య్ర పోరాటంలో 1930_33మధ్య కాలంలో ఎందరో మగువలు ధైర్య సాహసాలతో బ్రిటిష్ దమనకాండకి ఎదురుతిరిగారు. అలాంటి కొందరు మహిళామణులగూర్చి తెలుసుకుందాం.బారు అలివేలమ్మ 1894 లో పెద్దాపురంలో పుట్టి నరాజమండ్రి నివాసి .భర్త రాజారావు ఎఐసిసి సెక్రట్రీగా రెండు దశాబ్దాల పనిచేశారు.రెండేళ్లు భార్యాభర్తలు గాంధీజీ సేవాగ్రాంలో ఉన్నారు.కమలానెహ్రూ తో కల్సి అలివేలమ్మ అలహాబాద్ లో పికెటింగ్ లో పాల్గొన్నది 1930లో! ఆమె కొడుకు 9ఏళ్ల గోవిందరావు ఇందిరాగాంధీతో కల్సి వానరసేనలో పాల్గొన్నాడు. తట్ట ఆండాళమ్మ రాజోలు కి చెందిన కడలి నివాసి.భర్త రాఘవాచారితో కల్సి ఉద్యమాల్లో పాల్గొనడంతో,ఇద్దరు జైలుశిక్ష అనుభవించారు.సింహాద్రి అన్నపూర్ణాదేవి రాజమండ్రీ వనిత. తండ్రి శ్రీ సూర్యనారాయణ. 1932లో నెల్లూరు సబ్ జైలు,వెల్లూరు జైలుశిక్ష అనుభవించారు.వేదాంతం కమలాదేవి ఎఐసిసి స్టాండింగ్ కమిటీ మెంబర్ గా 1929,1930,1934లో సేవచేశారు.పక్షవాతం తో బాధపడుతూ కూడా విశాఖ పట్టణం జిల్లాలో పర్యటించి ఉప్పుసత్యాగ్రహంలో స్త్రీలు పాల్గొనేలా ప్రోత్సాహించిన మహిళ.పోలీసుల దమనకాండను గూర్చితెలియగానే రాత్రి రైలులో పయనించిన కమలాదేవిని కష్టడీలోకి తీసుకున్న పోలీసులు క్షమాపణ కోరితే విడిచిపెడతామన్నారు.కానీ ఆమె మొండికేసి అంది" నేను నేరం చేయలేదు.దేశానికి పూర్ణస్వరాజ్యం వచ్చితీరాలి.నేను క్షమాభిక్ష కోరనుగాక కోరను".21మే 1930లో వెల్లూరుజైలుశిక్ష అనుభవించిన ఆమె 1931లో ఇచ్ఛాపురంలో జరిగిన ఉమెన్స్ కాన్ఫరెన్స్ కి అధ్యక్షత వహించారు.200రూ.ఫైన్ జైలుశిక్ష విధించారు.సరోజినీనాయుడు అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సభలో జోష్ గా
మాట్లాడినందుకు వెల్లూరుజైలుశిక్ష పడింది.కాకినాడ కిచెందిన మానుగంటిలక్ష్మీనరసమ్మ తండ్రి శ్రీ లక్ష్మీకాంతరావు. గాంధీ ఇర్విన్ ఒప్పందంతో వెల్లూరుజైలుశిక్ష అనుభవించిన ఆమెను 1మార్చి 1931లో విడుదల చేశారు🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి