మరుగున పడిన మగువలు27: -అనువాదం...అచ్యుతునిరాజ్యశ్రీ
 డా.కె.జానకిగారిRole of women in freedom struggle in Andhra Pradesh
పెద్దాడ కామేశ్వరమ్మ గారు15మే 1907లో రాజమండ్రీలో పుట్టారు.తండ్రి సుందరశివరావు. భర్త ప్రొఫెసర్ బి.కుప్పుస్వామి. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఐన కామేశ్వరమ్మ  కుటుంబమంతా బ్రహ్మ సమాజంలో చేరారు.అనీబిసెంట్, లేడీ కజిన్స్ వారికి సన్నిహిత మిత్రులు.ఆమె తల్లి వెంకట సుబ్బమ్మ రాజమండ్రిలో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ సెక్రటరీ,తొలిమున్సిపల్ కౌన్సిలర్ కావటంతో కామేశ్వరమ్మ  తల్లికి చేదోడువాదోడుగా ఉండి హిందీక్లాసులు మహిళల సభలు నడపటంలో ప్రముఖ పాత్ర పోషించారు.గాంధీజీకాకినాడ వచ్చినపుడు1921,1923,మద్రాస్ లో 1927లో వాలంటీర్ గా పనిచేశారు.మద్రాస్ లో ఆమెసరోజినీనాయుడు,కమలాదేవిచటోపాధ్యాయ,ముత్తులక్ష్మీరెడ్డి మొదలైన వారితో స్నేహం ఏర్పడింది.ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి ఆమె రాజకీయ గురువు.ఉప్పు అమ్మి కాంగ్రెస్ కి నిధి సేకరించింది.అరెస్టయిన తర్వాత గాంధీ ఇర్విన్ ఒప్పందంతో వెల్లూర్ జైలు నుంచి విడుదలైనారు.కాకినాడ లోశిబిరాలు ఏర్పాటుచేసి యువతీ యువకుల కు శిక్షణ ఇచ్చారు.ఖాదీ అమ్మకంకోసం ఇల్లిల్లూ తిరిగారు.పోలీసుల కళ్లుగప్పి మీటింగుల్లో మాట్లాడేవారు. గాంధీజీ మీరాబెన్ ని పంపారు స్వదేశీ ఎగ్జిబిషన్ కి.పోలీసులని ఏమర్చటానికి పెద్దాపురంలో పిక్నిక్ ఏర్పాటుచేసి అందరినీ ఆహ్వానించారామె. కానీ ఈటెతో సహా అందరూ లాఠీదెబ్బలకు గురైనారు.కామేశ్వరమ్మ మద్రాస్ లో  కాంగ్రెస్ హాస్పిటల్లో గాయపడిన కాంగ్రెస్ వాలంటీర్లకి సేవ చేశారు.చైనా బార్లి పికెటింగ్ చేసిన ఈమెను,ఇంకొందరినీ  జైల్లో ఖాళీలేక హాస్పిటల్ వార్డ్స్ లో బంధించారు.ఆపై విడుదల చేశారు.కరాచీ కాంగ్రెస్ కి హాజరైన ఆమెతూర్పుగోదావరిజిల్లా డి.సి.సి.ప్రెసిడెంట్ గా,ఎఐసిసి మెంబర్ గా,మైసూర్ మద్రాస్ ఢిల్లీలో ఎక్కడున్నా  ప్రజాసేవచేసిన కామేశ్వరమ్మ ఆదర్శ నారి.ప.గో.జి కి చెందిన గూడూరినాగరత్నమ్మ 6జులై 1913లోయర్నగూడెంలో పుట్టారు.రాజమండ్రివాసియై1926_32లో చాగల్లుఆశ్రమం సభ్యురాలిగా 16మార్చి1933లో కన్ననూర్ జైలుశిక్ష అనుభవించిన మహిళ.గుజ్జు నాగరత్నమ్మ  భర్త రాజమండ్రివాసి వెంకటరావుగారు.  ఆంధ్ర రాష్ట్ర మహిళాసభ సభ1933లో హాజరైనందుకు వెయ్యి రూపాయల జరిమానా, జైలుశిక్ష 
విధించబడింది.🌹

కామెంట్‌లు