గోదారోళ్ళ రుచులు.... పార్ట్ 2 !: -యెనుముల వేణుగోపాలరావు

 అమలాపురం _
చెట్టు కింద జిలేబీ,తింటే 
ఆ రుచి ....
జీవితంలో మర్చిపోలేవు తంబి !
నల్లవంతెన దగ్గర 
సోమ్ పాపిడి ,తింటే 
చెరగమన్న చెరగదు - 
నీ తల పాపిడి!
అంబాజీపేట 
పనసాకులో - చేసే పొట్టిక్కలు ,
తింటే తగ్గిపోతాయి - 
అన్నిరకాల తలతిక్కలు !
అక్కడ దొరికే పనస తొనలు ,
ఆ వాసనకు నాట్యం చేస్తాయి -  
ముక్కు పొరలు !
పల్లంకుర్రు గ్రుడ్డు పీతలు ,
ఆ రుచికి దిగి వస్తారు 
మీ తాతలు!
కాకినాడ చుక్క పీతలు,
తింటే వర్ణించలేము - 
నువ్వు చేసే చేతలు!
కాకినాడ _
సుబ్బయ్య హోటల్ భోజనం ,
ఆ మర్యాదలకు, రుచులకు 
మర్చిపోతాం - మనల్ని మనం !
నగరంలో దొరికే _
నానిరొట్టి , శేరువా ,
ఆ రుచిని _
మాటలలో వర్ణించగలమా ?
రాజోలు అడబాల బ్రదర్స్ - 
చిట్టి చేకోడి, అల్లం పకోడీ ,తింటే  
మనసు ఆడేస్తుంది -  
ఇక చెడుగుడి !
రాజోలు అప్పలరాజు - 
చేపల పులుసు ,
దాని రుచి _
కోనసీమ వాసులకే  తెలుసు !
మలికిపురం 
కాకి రామారావు ధంపలావు ,
తింటే ....
కొట్టకుండా ఉండలేము సలాం !
ఆయ్..... గోదారోల్లా మజాఖానా
చూడాలంటే ___
మా రుచులతడాఖా
మరి... ఒకసారివిచ్చేయండి...
మా జిల్లాలకు ....ఇక !!
                   ***
కామెంట్‌లు