ఆకాశవాణి సమాచారం 2: -సేకరణ...అచ్యుతునిరాజ్యశ్రీ

( డాక్టర్. నాగసూరివేణుగోపాల్ సిగ్నేచర్ ట్యూన్ పుస్తకంనుంచి)
16 జూన్ 1938 లో మద్రాస్ బొంబాయి,కలకత్తా రేడియోకేంద్రాలు బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి.రేడియో గూర్చి దాశరథి కృష్ణ మాచార్య గారు  ఎంత సున్నితంగా అందంగా చెప్పారో చదవండి"రేడియో రెక్కల గుర్రం వంటిది. అది వెళ్లలేని చోటు లేదు."రేడియోకి రాయడం అంత తేలికైన విషయం కాదుసుమా! నాగసూరిగారు ఆవిషయంని ఇలా వివరించారు" రేడియోని లొంగదీయడం అంటే ఐరావతాన్ని అధిరోహించడం" చెవి ద్వారా బుర్ర లోకి త్వరగా పదాలు దూరి ఠక్కున అర్ధం కావాలి పామరులకు.అప్పుడే పల్లెవాసులకి కూడా విషయంపై అవగాహన కలుగుతుంది. శబ్దాలతో జరిగే సంఘటనలు శ్రోతలకి తెలుస్తాయి. ఉదాహరణకు ఎడ్లబండి చప్పుడు,రైలుకూతలు రేడియోనాటకాల్లో వినిపిస్తే శ్రోతలకి తేలిక గా అర్ధం అవుతుంది.
1947 లోమనకుస్వాతంత్ర్యంలభించింది ఢిల్లీ,కలకత్తా,బొంబాయి,లక్నో,మద్రాసు,తిరుచిరాపల్లి లోఆకాశవాణి కేంద్రాలున్నాయి. పాకిస్థాన్ లో లాహోర్,పెషావర్,ఢాకా లో ఉన్నాయి.స్వతంత్ర భారతదేశంలో ఆకాశవాణి కి పక్కా గా బాటలు వేసిన వారుసర్దార్ వల్లభభాయ్ పటేల్.ఆయన తొలి సమాచార ప్రసార శాఖామంత్రిగా వెలుగుదివ్వెగా నిలిచారు.భాష కి మంచి పట్టు కలిగేలా ఆనాటి ఆకాశవాణి ఉద్యోగులు,కళాకారులు చేసిన కృషి నభూతో నభవిష్యతి.పిల్లలు మొదలు పెద్దల దాకా సన్నిహిత నేస్తం రేడియో! టైంతెలుసుకోవాలంటే,రేడియో! సమయపాలన కి పెట్టిందిపేరు.
రేడియో మాధ్యమంగూర్చి ఇప్పటికీ తెలుగులో సరైన కోర్సు,పుస్తకం రాలేదు.శ్రీవేణుగోపాల్ గారు మూడుదశాబ్దాలకు పైగా రేడియోలో 200మందికి పైగా ప్రోగ్రాములకి సంబంధించిన వ్యక్తులతో పనిచేశారు.ఆసక్తి,కుతూహలం,ప్రయోగాలతో రేడియో లో ఉద్యోగం చేస్తూనే అందరికీ తన అనుభవాలు ఆసక్తికరంగా వివరిస్తూ పుస్తక రచన గావించటం ముదావహం🌷
కామెంట్‌లు