మొక్కోటి దేవతలు 33 ( ముప్ఫయి ముగ్గురు! )
పదునొకటి రుద్ర సంఖ్యయు
అదనముగ నొకటి గలుపగ నాదిత్యులుగన్
ముదమున వసువులు నెనిమిది
తధాస్తనగ అశ్వినీలు దక్షు లిరువురున్
వరుసగ వీరిని కూడగ
సరగున ముక్కోటి దేవ సంఖ్యను కనగన్
నెరిగితి ముప్పది మూడును
వెరువక నే కొలిచెద నిక వేల్పుల విధిగన్
1 వ పద్యములో చివరి పాదము ..
\ అశ్విని దేవతలకు “ తధాస్తు ”. \
దేవతలనే పేరు కూడా వుంది.
దక్షు లిరువురున్ = దక్షత (నేర్పు, skill) కల ఇద్దరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి