అసలైన విజయం అంటే
కేవలం సంపద, కీర్తి కాదు,
అది అంతర్గత తృప్తి, నిరంతర కృషి,
పట్టుదల, ,ఇతరుల జీవితాల్లో వెలుగు నింపడం...!!
అసలైన విజయం అంటే
నిజాయితీగా జీవించడం, ప్రతిభను పెంచుకోవడం
తోటివారిని ప్రేమించడం
వంటి ఉన్నత విలువల జీవితం!!
పదిమందికి ప్రేరణ కలిగించి మార్గదర్శనమైతే,
అది భౌతిక సంపదను దాటి,
వ్యక్తిగత ఎదుగుదల, మానసిక
ప్రశాంతతను,సమాజానికి మనం అందించే
సేవే నిజమైన విజయం!!
విజయం అంటే ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం,
కృషి పట్టుదల నిరంతర ప్రయత్నంతో
ప్రకృతితో మమేకమై ఉండటంతోపాటు
సవాళ్లను అధిగమించడం
ఓటమిలో నిబ్బరం వహించి
నిరంతరం సాధనలో తపిస్తూ
తోటివారికి సదా సహాయ సహకారాలు
అందించిన అదే కదా అసలైన విజయం!!!
విజయం అంటే వ్యక్తిగత సంతృప్తితో
ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా
తయారు చేయగలిగితే అదే అసలైన విజయం!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి