ప్రవాస పద్య పరిమళము - 7: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA

అంశము: వర్ణన 
విషయము: గ్రీష్మము 
ఛందము : శార్దూలము

ఎండల్మండెడు వేళ ప్రాగ్దిశ భువుండేకాగ్రతన్ తీవ్రతన్ 
చండామార్కుని రీతి గ్రీష్మతపమున్ చండప్రచండంబుగా 
బండల్ చీల్చెడు తీక్ష్ణమైన సెగతో భగ్గంచు గుప్పించగా 
నిండుంబ్రాణము బిక్కజచ్చె నకటా! నిస్తేజమై క్రుంగితిన్ 

ప్రాగ్దిశ = తూర్పు దిక్కు 
భువుడు  = సూర్యుడు 

కామెంట్‌లు