ప్రవాస గేయ పరిమళం - 8 :-- వెంకట్ కోత్తూర్ Ashburn VA USA
తెలంగాణా వైతాళికుడు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి  130 వ జయంతి సందర్భముగా. .గేయ నివాళి 


పాలమూరు పటిమ

పాలమూరు పటిమ గగన తలమున గరిమ
సురవరుని గళము కల కలమైన సీమ
మాటలను సూటిగా ఎదలోన నాటగా
జనజాగృతి కి కలము బలము నీగ 

నైజాము నైజమును నేరుగా ప్రశ్నించు 
గుండె నీది గోలుకొండ నీది
పలు తెలుగు పత్రికల ప్రాణ ప్రదాతగా 
బహుముఖ ప్రజ్ఞా విశారదునిగా 

మట్టి దాగిన తెలంగాణ మాణిక్యాల 
మణిహారముగ కూర్చీ మాల చేసి 
తెలుగు భారతి కవన పవన వీచికలలో 
గోల్కొండ కవుల సంచికను  కూర్చి

పత్రికా జగతిన బావుటా నెగురవేసి 
కేంద్ర సాహిత్య పురస్కారమ్ము నంది
మనకు సురవరం వరము వాగ్దేవి కరుణ 
కవన జగతిన ఈ  స్మరణ మధుర స్ఫురణ 

కామెంట్‌లు