కాలమే!: - డా పివిఎల్ సుబ్బారావు విజయనగరం 94410 58797.
1.
నిన్న ,మాయం,
    రేపు, అయోమయం ,
      ఉన్న నేడే ,నీ ప్రాయము! 

తాతలు నేతలు తాగారు ,
ఆ వైభవం అప్రస్తుతము! 

పుత్రులు రాజ్యాలేలుతారు, 
వారిదా ప్రయోజకత్వము!

నేడున్నది నీ బతుకు,
నిత్య వర్ధనం నీ కర్తవ్యము!

బతుకు దైవానుగ్రహం
 ఆనందమయం, ప్రతి క్షణము, 
పివిఎల్!

2.
కాలం రైలులో ప్రయాణం, 
దాటిన స్టేషన్ మరి రాదు!

ఎన్ని స్టేషనులు,
      ముందున్నాయో, 
        మనకేమీ తెలియదు!

మనం దిగాల్సిన, స్టేషన్ తథ్యం, 
వస్తే దిగక తప్పదు! 

తప్పని ప్రయాణం మరి, 
చింతలేల బతుకు ఆగదు! 

చింతాకంత,చింత ఏల?
నీ చింతన ఏది కుదరదు,
పివిఎల్!
_________


కామెంట్‌లు