జేష్టం! నిరవధిక కష్టం!: - డా పివిఎల్ సుబ్బారావు విజయనగరం, 9441058797.
1.
మండుటెండల బాధలు,
 మరి సహింపగ అశక్యము!

పిన్పలు పెద్దలు జనావళి, 
జీవనం దుఃఖగ్రస్తము!

పగలు రాత్రి సూర్య పగ ,
ఆపగ ఎవరి తరము!

మల్లెలు గుబాళింపు మరిచే,   
   ప్రకటించె సంతాపము!

గాడ్పుల ఘాటున జనం,
మరిచే మామిడి మాధుర్యము, 
పివిఎల్!

2.
కరెంటు కోతలు ,నీటి ఎద్దడులు,
  గ్రీష్మము శాపము!

అధిక జ్యేష్టమే ఇంత కష్టం, 
   అసలు ఊహాతీతము! 

ఇన్వర్టర్లు, ఏసీలు ,నిర్వీర్యము,  
   భానుడే విజయము! 

లేవడానికి ,ముందే ,ఎండే లేచే,
   దినమంతా గండము!

ఇక రేపుమాపు ,ఋతుపవనాల, ఎదురుచూపులే,పివిఎల్!
__________


కామెంట్‌లు