సకల విద్యలకు మూలం శివుడు !:-గుర్రాల లక్ష్మారెడ్డి -సెల్.9491387977. కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ
సకల విద్యలకు మూలపురుషుడు శివుడు. సృష్టిలోని సర్వవిద్యలకు నిలయము పరమశివుడు.శివుడు మహా జ్ఞానేశ్వరుడు . సర్వవిద్య ప్రదాత. ఈ సృష్టిలో ప్రధానంగా 18 మహా విద్యలు ఉన్నాయి. ఈ విద్యలకు అధిపతి మహా ప్రభువైన  శివుడే అధినేత.ఎవరైతే  శివుడిని ఆరాధించి శివానుగ్రహం సాధిస్తారో వారికి మాత్రమే ఈ 18 విద్యలు సులభంగా, శీఘ్రంగా వారి సొంతమవుతాయి. అందుకే తైత్తరీయ అరణ్యకం 
ఈశాన స్పర్శ విద్యానామీశ్వరస్సర్వ భూతానం
బ్రహ్మాదిపతిర్ర్బహ్మణోధిపతిర్ర్బహ్మ శివ మేస్తు సదాశివోహం !
వేదాలకు, శాస్త్రాలకు, ఆగమాలకు, పురాణాలకు, సర్వ విద్యలకు పరమశివుడే అధిపతి అని తెలిపినది.
సనాతన హైందవ వాంగ్మయంలో, సాంప్రదాయంలో అనేక విద్యలు ఉన్నాయి. మరి ఈ విద్యలను బోధించిన తొలి గురువు ఎవరు?
సకల విద్యలకు మూలమైన దైవం ఎవరు? అనే విషయాలు అత్యంత రహస్యమైనవి. సకల విద్యలకు శివుడే ఆదుగురు అని, మూలధైవమని సాక్షాత్తు వేదమాతయే స్వయంగా ఈ లోకానికి వ్యక్తం చేయడం జరిగింది. అష్టాదశ మహా విద్యలు అంటే 18 విద్యలకు మూలకర్త ఎవరో వేదం ఈ క్రింది విధంగా తెలిపింది.
"అష్టాదశానా మేతాసాం-విద్యానాం భిన్న వర్త్మనాం
ఆదికర్తా శివః సాక్షా -చ్చూలపాణి రితి శ్రుతిః
వేరు వేరు మార్గములు గల ఈ 18 మహా విద్యలకు ఆదికర్త, తొలి కర్త, మూలకర్త సాక్షాత్ శూలపాణియైన శివుడే అని వేదం రహస్యపుముడిని విప్పదీసింది.
ఆ 18 మహా విద్యలు
+++++++++++++++
1) వేదాలు------------4.
2) ఉపవేదాలు-------4
3) వేదాంగములు----6
4) పురాణం----------1
5) న్యాయ శాస్త్రం----1
6) మీ మాంస----------1
7) ధర్మశాస్త్రం----------1
అందుకే వేదం
"జః కాల కాలో గుణీ సర్వవిద్య"
సర్వజ్ఞుడు, కాలకాలుడు, సర్వ కళ్యాణ గుణములు కలిగినవాడైన ఈశ్వరుడు సమస్త విద్యలను అధిష్టించి ఉండునని తెలిపినది.
ఎవరైతే శివుడిని ఆరాధిస్తారో, వారసులభంగా మహా జ్ఞానులవుతారు. శీఘ్రంగా సకల శాస్త్ర కోవిదులు, మహా ప్రజ్ఞా వంతులు అవుతారు. సర్వవిద్యలు సులభంగా, శీఘ్రంగా వారి సొంతమవుతాయి.
కాబట్టి శివుని నిత్యం ఆరాధించు నీవు తరించు.
శివుడు సర్వవిద్యలకు ఏ విధంగా మూలమో, ఆ పరమ రహస్యాన్ని
గమనించండి.
శివుని ఢమరుకం నుండి 51 బీజ మంత్రములు ఉద్భవించాయి. శివుని తాండవ సమయమున ఢమరుక ధ్వని నుండి 14 శబ్ద శాస్త్ర సూత్రాలు ఉద్భవించాయి.
వీటిని మహేశ్వర సూత్రాలు అని అంటారు ఈ సూత్రాలతోనే ఎందరో మహర్షులు ఎన్నో శాస్త్రాలను రచించారు. ఈ సూత్రాల ఆధారముతోనే పాణి మహర్షి వ్యాకరణ శాస్త్రం అష్టాధ్యాయిని అనే శాస్త్రమును రచించారు.
 

కామెంట్‌లు