మన తొలి ప్రధాని!!:- గుర్రాల లక్ష్మారెడ్డి -సెల్.9491387977. కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.
మోతిలాల్ నెహ్రూ స్వరూప రాణి అనురాగ దంపతులు
మన పండిత నెహ్రూజీని కనిపించిన తల్లిదండ్రులు
ఓ శుభ ముహూర్తమున వారి కడుపు పండె
ఆ దంపతుల గుండెల్లోన ఆనందం నిండె  !

జవహర్లాల్ నెహ్రూజీ అలహాబాదులో జన్మించే
గాంధీజీ సలహాపై తాను సమరదళంను నిర్మించే
ఇన్నర్ టెంపుల్ కాలేజీలో *లా" కోర్సు చదివాడు
ఐర్లాండ్ షిన్ఫెయిన్ ఉద్యమంతో తాను ఎదిగాడు !

గాంధీజీ ఉద్యమస్ఫూర్తితో మేల్కొన్నాడు
స్వాతంత్ర సమరంలో స్వయంగా పాల్గొన్నాడు
విజయమో వీర స్వర్గమో అని మదిలో భావించాడు
సమర శంఖం పూరించి ఆ సమరంలో జీవించాడు !

బ్రిటిష్ పోలీసుల చేతుల్లో లాఠీ దెబ్బలు తిన్నారు
స్వాతంత్రం భారతీయుల జన్మహక్కని అన్నారు
అల్మోరా జైలులో తన జీవిత చరిత్ర వ్రాసుకున్నరు
విజయం సాధించి తొలి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నరు !

బాల బాలికలు అంటే ఆయనకు ఎంతో ప్రేమ
భారత దేశ అభివృద్ధికి పడ్డాడు  ఎంతో శ్రమ
గాంధీయవాదిగా నిలిచి గెలిచిన వాడు
గర్వంగా భారతదేశాన్ని పాలించిన రేడు !


కామెంట్‌లు