కూడదు!
ఇది పుణ్యభూమి. ఇక్కడ అన్నవిక్రయం జరగకూడదు.
ఇది వేద భూమి. ఇక్కడ వేద శాస్త్రాల విక్రయం ఉండరాదు.
ఇది ధర్మ భూమి. ఇక్కడ విద్యా విక్రయం చేయకూడదు.
ఇది కర్మభూమి. ఎవరూ దుఃఖితులు కాకూడదు.
వేల సంవత్సరాల నాటి భారత దేశ సమాజం, భారత ప్రజ, భారతదేశం రాజరికం, పైన పేర్కొన్న సిద్ధాంతాలను తు.చ తప్పకుండా నియమనిష్టానిరతులై పాటించేవారని మన శాస్త్రాలు, స్మృతులు చెబుతున్నాయి. వేల సంవత్సరాల క్రితం వరకు ఆహారాన్ని, విద్యనూ విక్రయించేవారు కాదు ఇక్కడ. అంతెందుకు ఈనాడు కూడా వేద పురోహితులు వివాహం చేయించినా, పూజలు పునస్కారాలు జరిపించినా ముందుగానే ఇంత ఇవ్వాలన బేరం చేయరు. ఎక్కడైనా ఎవరైనా వివాహం చేయిస్తే ఎంత ఇస్తారు? పూజ చేయిస్తే ఎంత ఇస్తారని గనుక అడిగితే వాడు బ్రాహ్మణుడే కాదని అర్థం. అటువంటి అధమ బ్రాహ్మణులతో వివాహాది వైదిక కార్యక్రమాలు చేయిస్తే ఫలితం ఉండకపోగా దురుతం వస్తుంది.
ఈనాటి భోజన హోటల్స్, ఉపహారశాలలు మన సాంప్రదాయం కాదు. భారతీయ ధర్మ శాస్త్రం అతిధి దేవోభవ అని చెబుతోంది. ప్రతి గృహస్తుడూ వర్ణకుల విభేదం లేకుండా ప్రతిరోజూ ఎవరో ఒక అతిధికి భోజనం పెట్టి దైవ కార్యంగా సంతోషపడేవారు. అన్నదాత సుఖీభవ అని భోజనం చేసిన అతిథి ఆశీర్వదించి వెళ్లేవాడు. ప్రతి ప్రాణికి ఆహారం అతి ముఖ్య అవసరం కదా!
విద్యా దానం మహత్తరం. మనం నేర్చిన విద్య మనతోనే నశించి పోకూడదు. ఒక విత్తనం నాటితే వేల విత్తనాలు మనకు అందించినట్లుగా మనం నేర్చిన విద్యను మన సమాజానికి అందించి విద్యాసంపన్నులను చేయడమే విద్యాపరమార్థం. మనిషికి వి జ్ఞాన వివేకాల నందించే విద్యను ధనాశతో విక్రయం సాగిస్తే నీవు జన్మించిన నీ సమాజానికి నీవేమి ఉపకారం చేసినట్లు? నీ జన్మభూమికి నీ రుణం తీరేదెట్లు? జననీ జన్మభూమిశ్చ స్వర్గాలపిగరేయసి అన్న హితవాక్యం ధూళికి పోయినట్లే కదా! ప్రపంచానికే ఆదర్శవంతమైన దేశం మనదే ఒకప్పుడు.
పాశ్చాతుల పాదార్పణతో భారత సాంప్రదాయాలన్ని హారతి కర్పూరమైపోయాయి. ఈనాటి విద్యార్థులు చదవటం లేదు. చదువునుకొంటున్నారు. ఈ దేశ తీరుతనులన్నీ మారిపోయాయి.
మార్పు సహజమే. మార్పు కోరుకోవడమే మానవ లక్షణం. మార్పు లేకుంటే మనం ఇంత ప్రగతిని సాధించే వాళ్లం కాదు. కానీ, మార్పుతో పాటుగా మానవతా కూడా ఉంటే ఎంత బాగుంటుంది! మానవత నిండిన మనుగడ మాత్రమే మనిషికి మహాదానందాన్ని కలిగిస్తుందన్నది నిత్య సత్యం.
ఎన్ని దేశాలైన పర్యటించు. మన దేశాన్ని మాత్రం మరిచిపోకు.
ఎన్ని భాషలు అయినా నేర్చుకో. నీ తల్లి భాషను మాత్రం మర్చిపోకు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి