న స్నానం నవిలేపనం నకుసుమం నాలంకృతా మూర్థజాః
వాణ్యేకా సమలంకరోతి నపుషం యా సంస్కృతా ధార్యతే
క్షీణ్యంతే కీల ! భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్!!
మనిషికి ఎన్ని బంగారు ఆభరణాలున్న అవి ధరించినప్పుడు మాత్రమే అందాన్ని ఇస్తాయి. విద్య అనే ఆభరణం మనిషికి సదా ఆభరణంగా ఉండి కీర్తిని గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.
ధనవంతుడు తన ఊరికే గొప్పవాడు. విద్యావంతుడు దేశానికే గొప్పవాడు.
ధనంతో పలం కొనగలం! ఫలితాన్ని కొనలేం !
లక్ష్మీదేవి సరస్వతికి అత్తగారు అవుతుంది కదా! అత్తగారి అధికారం అంతటిదైనా కోడలి అధికరణం తక్కువేమీ కాదు. ధనం ఏ కారణంగా నైనా తరిగిపోవచ్చు. విజ్ఞానం నానాటికి పెరగడమే కానీ తరిగిపోవడం ఉండదు. ధనాన్ని దాయాదులు భాగం పొందవచ్చు. విద్యను ఎవరూ భాగం పంచుకోలేరు. ఎవరూ దొంగిలించలేరు. ఏనుగు ఎంత పెద్దదైనా తొండము చిన్నదైనా దీని విలువ దానిదే మరి. అవునుగదా.
ధన కాముక జగత్తులో ధనవంతుడే భగవంతుడు. కానీ వివేక ప్రపంచంలో విద్యావంతుడే సృష్టికర్త. విజ్ఞాన జగత్తులో ప్రజ్ఞావంతుడే పరమాత్మ. మదంతో మేదస్సు రాదు. ధనంతో విజ్ఞానం రాదు.
ఈనాడు మనం అనుభవిస్తున్న సుఖాలన్నీ మేధావంతులు, విజ్ఞానులు ప్రసాదించినవే గాని ధనవంతులు ఇచ్చినవి కాదు. ఈ మాత్రం జ్ఞానం కలిగిన వాడు ఎవడైనా విద్యావంతునికి నమస్కరించి గౌరవిస్తారు.
జ్ఞాన శక్తికి మించిన మరొక శక్తి ఈ జగత్తులో లేదు.
ఏడంతస్తుల మేడ కట్టినా ఉండబోయేది, తనకు కావలసింది ఆరడుగుల స్థలం మాత్రమే గదా అన్న జ్ఞానం కలిగినవాడు తపనపడిపోతాడు.
తలకిందులైపోతాడు. తనకు తానే గులకరాయిలా కనిపిస్తాడు.
ధనం క్షణం కనిపించే మెరుపుతీగ. విద్య తన వారందరికీ వెలుగు చూపించి నడిపించే దారి దీపం. మెరుపుకున్నంత కాంతి దీపానికి ఉండదు. దీపానికి ఉన్న ప్రయోజనం మెరుపుకు ఉండదు. డబ్బుతో మందులు కొనవచ్చు. వైద్యుని కొనలేవు. ఒకానొక సమయంలో వైద్యుని కూడా కొనవచ్చు కానీ వైద్య విజ్ఞానాన్ని కొనలేవు.
ఆ విజ్ఞానమే సరస్వతి మాత. ఎవరైనా భార్యను కొనగలరు. తల్లిని మాత్రం కొనలేరు కదా!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి