చుక్కాని లేని నావకు
ఉత్తమసరంగు నా దోస్త్
ఇప్పటి నా జీవితానికి
దిశాదశావాడే
మా అమ్మలాగ వాడు
నా కళ్ళలోకే చూసేటోడు
ఏదో బాధలో ఉన్నావని
నువ్వు తిన్నవాలేదా
అని విచారించేటోడు
ఉండి లేని కాపురాలు మావి
వాడు మంచి శ్రీమంతుడు
ఎట్లగలిసిండో వాడు
తనువులు వేరైనా ఆత్మ ఒక్కటే అన్నట్టుగా
వాడితోనుంటే
కష్టమేదైనా దూదిపింజలా తేలికయ్యేది
ఎప్పుడు నవ్వుతూ ఉండాలని
హితబోధ చేసేటోడు
చిరునవ్వు తన ముఖాన చెదరనీయనోడు
ఎన్ని బుద్ధిమాటలు చెప్పేటోడో
బ్రతుకుపాఠమంతా వల్లెవేయించేటోడు
దోస్త్ మేరా దోస్త్
మనమా నింగిలో చందమామలా వెలగాలనేటోడు
మనదారెప్పుడు రుజువైనదై ఉండాలనేటోడు
విలువలే ఆస్తిపాస్తులు అనేటోడు
కష్టసుఖాలు జంటపదాలేతప్పా
జీవన పర్యంతం అవి మనతో ఉండవనేటోడు
ఆ పక్షుల్లా స్వేచ్ఛగా సంచరించాలనేటోడు
ప్రకృతిని చూసి పరవశించాలనేటోడు
పాడుచేయోద్ధని హితబోధ చేసేటోడు
ఎన్నో సుద్ధులు బుద్ధులు నేర్పి
బ్రతుకు నడిమిట్లనన్ను
కాటగలిపిపోయాడునేస్తం
ఎక్కడని నేను నిన్ను వెతకనూ
నా జ్ఞాపకాల్లో సజీవమైన దోస్త్
ఒక్కో యాది నాలో ఒలపోతైపోయే
నా పుట్టెడు దుఃఖాన్ని నేనెరితో పంచుకోను
నన్ను ఓదార్చే నువ్వే నాకు చెప్పాపెట్టకుండా వెళ్లిపోతే
నేనెవరిని అడిగేది
ఆపాపకారి దేవుడు మనకు పాపమే చేసిండు
ఎంతో ప్రాణానికి ప్రాణంగా ఉన్న ప్రాణ స్నేహితుల్లో ఒక్కరిని దూరం చేసి
పాపమే మూటగట్టుకుండు
భూమిపై సకలమానవకోటి ఉన్నంతకాలం
మన స్నేహం వర్థిల్లుతుంది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి