మనిషి కామక్రోధలోభమోహాలకు బంధీయై
పశువైపోతే
అభం శుభం ఎరుగని
అబలలు మృగాడి దాష్టికాలకు
బలైపోతే
కాపుకాచేదెవరు!?
చట్టం పేదకు ఏమీ కానప్పుడు
చుట్టం బలిసినోడికైతే
రక్షకులెందుకు
న్యాయస్థానాలెందుకు
ఈ జైల్లెందుకు
చదువు పేదబిడ్డలకు రేపు
ఒక దారి చూపునని తలతాకట్టుపెట్టి తల్లిదండ్రులు
కాలేజీ ఫీజులు
ట్యూషన్ ఫీజులు చెల్లించి చదివిస్తే
ర్యాంకులు తెచ్చుకొన్న పేదబిడ్డలపై
కాలేజీల్లో ర్యాగింగ్ లు
ప్రేమపేరుతో మాయా వల విసరడం
వశపరచుకోవడం
కాదు కూడదు అంటే
అత్యాచారం చేయడం
ఏమైపోతుంది ఈ సభ్యసమాజం
నైతిక మానవ విలువలు లోపించిన చదువులతో
పశు ప్రవృత్తులు
డ్రగ్స్ కు మద్యానికి బానిసైన
ధనవంతుల కుమారుల
నిర్వాకం
ఒక పేద బిడ్డ జీవితాన్ని
చిందరవందర చేస్తే
సమాజాభివృద్ధికి దోహదపడే వ్యవస్థలన్నీ
తమ కనుసన్నల్లో నడిపితే
ఆ బాధితులకు న్యాయం ఎప్పటికీ దక్కేది
ఈ అరిగోసలు పడలేక అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి