చరవాణిలో
24/7
అన్లిమిటెడ్ కాల్డేటా
అనవసరపు కాల్స్ తో
అవతలివారి సమయాన్ని వృధా చేయడం
ఉబుసుపోక గాలి వార్తలు
చేతిలో చరవాణి
నోటికి నాన్ స్టాప్
వాగుడు
రాత్రి లేదు పగలు లేదు
రీల్స్ రీల్స్
ఇన్స్టాగ్రామ్
యూట్యూబ్
ఏదైతేనేం
ఉన్న విలువైన సమయాన్ని
ఊడ్చేయడానికి
దేశమ్మింది చెత్తనంత
ఉపయుక్తం
అనుపయుక్త మన్న
విచక్షణ కోల్పోయిన
చరవాణి వీక్షణోమైకం
అనవసరపు కాల్స్ అటెంప్ట్
చేయడం
లేని తగాదాలు నెత్తినేసుకోవడం
టచ్ మీ నాట్ లింక్ లు
ఓపెన్ చేయడం
ముసుగు దొరల చొరబాటు
ఉన్నదంతా కృష్ణార్పణం
చరవాణి అశరీరవాణి
అదో అదృష్టదేవతకాదు
డెవిల్
మితంగా వాడితే
వేడుకలు
అపరిమితమైతే
వీడుకోలు
చరవాణి చెరవీడాలి మనము
చరవాణి స్క్రీన్ టైమింగ్
సెట్ చేసుకోవాలి
చరవాణి వీక్షణా సమయాన్ని
తగ్గించుకోవాలి
శారీరక మానసిక ఆరోగ్యాన్ని
కాపాడుకోవాలి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి