బాల్యం చదువుల్లో బంధీ అయ్యింది
ఆ కొనిచదివే చదువులు విలువలు నేర్పేలాలేవు
విత్తమార్జనే నేర్పుతున్నాయి
పెద్దల పట్ల గౌరవం
విలువలతో కూడిన విద్య
అక్కడ వారి రాబడికి అడ్డంకి
అందుకే మార్కెట్ అవసరాలకోసమే ఆ చదువులు
ఫారిన్ కల్చర్ అందిపుచ్చుకుంటారు
అమ్మ నాన్నకు బదులు మమ్మీ డాడీ
అత్తమామకుబదులు ఆంటీ అంకుల్ వంటి పైపై వరసలు నేర్చుకుంటారు
ఇక్కడ సదాచారం నేర్పరు
నేటి బాలలే రేపటి పౌరులు
కాదు కాదు ఇక్కడ
నేటి బాలలే రేపటి మిలియనీర్లు,బిలియనీర్లు
వ్యక్తిత్వ వికాసం ఉండదు
కాసుల కోసమే స్కూల్స్ పెట్టారు
వారు నేర్పేదంతా కరెప్షనే
పసిపిల్లలకు మానవ సంబంధాలు వాటి ఆవశ్యకత గూర్చి తెలియజేయరు
పచ్చని ప్రకృతిని ఆస్వాదించండం
ఉండదు
చదువు తప్ప మరొకటి వల్లెవేయించడం జరగదు
ఫామ్ లోని పెంపుడు కోళ్ళేవారు
మంచి మానవత్వం లేదు
దయాజాలికరుణ వారి కరిక్యులంలో ఉండనే ఉండదు
పసివయసు నుండే తమ బిడ్డలకుతల్లిదండ్రులు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలనే తలంపుతో
ఎటువంటి ఎమోషన్స్ లేని
ఆ(రా)బడులకు పంపి వారిలో
దేశభక్తి, దైవభక్తి
ప్రేమ ,క్షమాగుణం మచ్చుకైనా లేకుండా దూరం చేస్తున్నారు
మనం ధనసంపాదన మిషతో
రేపటి యువతరాన్ని
నైతిక మానవ విలువలు లేని
రోబోలుగా మారుస్తున్నాం
అనే విషయాన్ని మరుస్తున్నాం
కుమారుడు చదువు పూర్తై ఉద్యోగం పేర
రెక్కలు కట్టుకొని ఫారిన్ వెళ్లి తిరిగిరానేరాడు
ఒకవేళ వచ్చిన చుట్టపుచూపుగా రావడమే
ఆసరా అవుతాడనుకున్నకొడుకు
అందకుండా పోయాడని వార్ధక్యంలో
ఉన్న తల్లిదండ్రులు కుమిలి కుమిలి ఏడుస్తున్నారు
అందుకే బాల్యం పిల్లల హక్కు
దానిని హరించడం నేరం
పిల్లలను నైతిక మానవ విలువలతో పెంచుదాం
రేపటి తరానికి వారధిగా
నిలబడదాం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి