వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
77. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా
(షోడశాక్షరీ)
78. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా
(షోడశాక్షరీ)
డెబ్బై ఎనిమిదవ నామ మంత్రము -
ఓం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః
భండాసురుని సోదరుడు శుక్రుడు, దెవీ సేనల మధ్య లోకి విసిరిన "జయవిఘ్న యంత్రాన్ని" ధ్వంసం చేసిన మహాగణపతి యొక్క వీరత్వాన్ని చూస్తూ సంతోషిస్తున్న పరమేశ్వరిని చూసిన, వశిన్యాది వాగ్దేవతలు జగన్మాతను, "మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా" అని కీర్తించారు. తన కుమారుని వీరత్వానికి మురిసి పోతున్న పరమేశ్వరి కి నమస్కారము.
శుక్రుడు, 8 కోణములతో, ప్రతీ కోణములో ఒక శూలమును ఉంచి, ఆ శూలములపైన "అలసా, కృపణా, దీనా మొదలైన 8 క్షుద్ర శక్తులను ఆవాహన చేసి, జయవిఘ్న యంత్రాన్ని శక్తి సేనల మధ్యలోకి వేశాడు. ఆ యంత్రం ప్రభావాన్ని ఆపడానికి ఏమి చేయాలి అని పరమేశ్వరి, పరమేశ్వరుని చూడగా ఆవిర్భవించిన వాడు, "మహాగణపతి". సర్వశక్తి సంపన్నుడు. సర్వశాస్త్ర అధిపతి. జగత్తు లోని అన్ని గణాలకూ అధిపతి.
*ఈ మహాగణపతి తన శౌర్య ప్రతాపాలతో, జయవిఘ్న యంత్రం పైవున్న ఎనిమిది రాక్షస శక్తులను సంహరించేసాడు. ఈ రక్కసి మూకల ప్రభావం తగ్గగానే, దేవీ శక్తుల వీరవిహారం మళ్ళీ మొదలయ్యింది. ఈ పరిణామాన్ని చూసిన లలితా పరాభట్టారిక, పరమానందాన్ని అనుభవించింది. "పుత్రోత్సాహము తండ్రికి...." అనే పద్యంలో చెప్పినట్లు."
"మనమందరం" ఈ జగత్తు లో ఏదైనా మంచి పని, వ్రతం, పూజా పునస్కారాలు చేయాలి అని తలచుకోగానే, ముందుగా మనకు గణపతే గుర్తుకు వస్తారు. పసుపు గణపతిని, "హరిద్రా గణపతిని", చేసి, ఘంటానాదం తో ఆహ్వానం పలుకుతాము. ఈ ఘంటానాదం విని క్షుద్ర, ఆసురీ శక్తులు ఆ కార్యస్థలం నుండి పారిపోతాయి. మనం తలపెట్టిన పని పైన, ఏ చెడు చూపు పడకూడదని, ఏ క్షుద్రశక్తుల నీడ పడకూడదని, చేసే కార్యానికి సత్ఫలితాలు రావాలని ఆశిస్తూ, గణేశ పూజ జరుపుకుంటాము.
ఈ విధంగా, మహాగణపతి సృష్టి చేసి, శుక్రుని జయవిఘ్న యంత్రాన్ని నశింపజేసి, తన సృష్టి లోని జీవులకు విఘ్నాలు కలగకుండా, కాపాడడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాత ను పూజించేటప్పుడు
ఓం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి