ఎవరిదో కానీ శబ్దనిశ్శబ్దాల ప్రవాహం
నడిచొచ్చింది నా దాకా దాహం
తెచ్చింది ఏమని వెతికితే
తేరిపార చూసిన కనుల ముందర
అర్థంకాని బ్రహ్మాండం
మాటైతే తిన్నగా అర్థం వినిపిస్తుంది కను రెప్పల కింది తెరపై
మౌనమైతే తిప్పితిప్పి టీకా తాత్పర్యం విప్పుతుంది చెవి చూపుతో ద్వైతాద్వైతాల దిగంతాలకు ఆవల ఆపైన
కేంద్రం నుండి చుట్టేసిన పరిధిలో
వలయ పరావలయ ఆవర్తనంలో
నెమ్మదిగా ఓపికతో
ఈ రెండు సందర్భాలు,సన్నివేశాలు
నేలపై ఒకటి, మరోటి నింగిలో
మరి మూడోదే వామనుని అడుగు
ఎంత గీపెట్టినా జవాబు దొరకదు
కానీ
ఆ రెంటినీ మించిన శక్తిశాలి
భౌతికానికి చిక్కని అద్భుతం
మంచీచెడు జంట పదాల మాటొకటి
మనిషిని మనిషి శక్తినీ కలిపేసుకున్న
రాగాల ఆలోచనల అపరంజి రాగమాల
నీతోనే కదిలే అడుగుజాడ
వేడి వెన్నెల వాడ
కనిపించని జ్వాల జలాంతర్గామి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి