ఆకాశవాణి సమాచారం 9: -సేకరణ....అచ్యుతునిరాజ్యశ్రీ
 డా.నాగసూరివేణుగోపాల్  సిగ్నేచర్ ట్యూన్ పుస్తకంనుంచి
పేపర్ చదివితే తట్టిన ఊహకి రూపంఇచ్చారు శ్రీనాగసూరిగారు.2002లో విజయవాడ లో మాతృభాషాదినోత్సవంపై పేపర్ లో వార్తచదివాక ముగ్గురు ప్రముఖులతో ఈయన యాంకర్ గా 25నిముషాలచర్చాకార్యక్రమం ప్రసారంచేసి అందరిప్రశంసలు పొందారు.కర్నూల్ వాసి రమణయ్య "కమ్మనైన తెలుగు" పాటరాసి గుర్తింపు పొందారు.అలాగే శ్రీ జి.కల్యాణరావుగారు రాసిన అంటరానివసంతం లోఉరుములనృత్యం కళారూపం వేణుగోపాల్ గారిలో కొత్త ఆలోచనకలిగించింది.ఇందులోంచే పేరిణి నృత్యం పరిణమించినది!శ్రీ అమళ్లదిన్నె గోపీనాథ్ గారిచేత 26కళారూపాల చిరుప్రసంగాలు చేయించారు.అలా అనంతపురం పల్లె కళారూపాలు "అనంత జానపదకళారూపాలు" అనే పుస్తకం గా రావటంతో అది ఒకరెఫరెన్స్ బుక్ గా శాశ్వతంగా సాహిత్యంలో నిలిచింది.చివరకుమిగిలేదితో ప్రసిద్ధిగాంచిన బుచ్చిబాబుగారు పి.హెచ్.డి.ఆపేసిమద్రాస్ ఆకాశవాణిలో పెక్స్ గా చేరారు.మరి రేడియో అంటే ఆరోజుల్లో అందరికీ అంత ఇష్టం విడదీయలేని బంధం!2004 లో విశాఖ కు బదిలీ కావటంతో శ్రీనాగసూరిగారు ఇంకో ప్రయోగంచేశారు.ప్రతిశనివారం మధ్యాహ్నం 3 గంటలకు యూనివర్శిటీ క్యాంపస్ లో జర్నలిజం శాఖ విద్యార్థుల లో సృజనాత్మకత బైట పడేలా కథ కవిత, మిమిక్రీ ఇలా అన్నీ 5గంటలదాకా రికార్డు చేసి కొన్నిటిని ఎన్నుకుని ప్రతిఆదివారం సాయంత్రం 5.30కి యువవాణిలో ప్రసారంచేయటంతో చాలామంది ప్రతిభావంతులు రాణించారు. మిత్రులు బాబీవర్ధన్ సహకారంతోయూనివర్శిటీ యువత జోష్ గా అందరినీ అలరించింది.ఇండియన్ ఎక్స్ ప్రెస్ లోరంగుల ఫోటోలతో  ఓఅరపేజీ వ్యాసం రావటంతోచాలా పాపులర్ ఐంది ఆప్రోగ్రాం.
ఇక ప్రతిఏడూ రిపబ్లిక్ డే కు ఓతెలుగుకవిని ఎంపికచేస్తారు. 22 భాషలను ఎన్నిక చేస్తారు కవులను. కాకినాడ కవి శ్రీ అద్దేపల్లి రామమోహనరావుగారిని ఎంపిక చేసి కవితను రికార్డు చేయటమేగాక శ్రీనాగసూరిగారు  ఆయన్ని ఇంటర్వ్యూచేసి,ఆపరిచయంని25జనవరి 2005న ఉదయం ప్రసారంచేశారు.రాత్రి 10గంటలకు జాతీయ కవిసమ్మేళనం లో కవిత ప్రసారం ఐంది.ఇలా కవికి తృప్తి కలగటమేగాక  శ్రోతలకి మంచి అవగాహన కలిగింది.🌷

కామెంట్‌లు