అమ్మ ప్రేమ అనిర్వచనీయము,
అనుభూతి జన్యము!
మనం కడుపులో పడ్డ నాడే,
మొదలగు ప్రేమ బంధము!
పుట్టిన మరుక్షణం నుండి,
దినదిన ప్రవర్ధమానము!
అమ్మ ప్రేమతో ఇచ్చిన క్షీరం,
జీవన పర్యంతం అమృతము!
అమ్మ ప్రేమ, క్షమ కు, నిర్వచనం!
మన అల్లరి భరిస్తుంది!
మన మొండితనం సహిస్తుంది!
అమ్మ ప్రేమే తన ప్రాణాన్ని,
మనకు పణంగా పెట్టిస్తుంది!
ప్రతిఫలాపేక్ష లేని ,
అమ్మ ప్రేమ అనన్యం!
అమ్మ ప్రేమగా చెప్పే,
పెద్ద బాలశిక్ష జ్ఞాన యజ్ఞం!
ప్రేమ నిండిన అమ్మచేతి,
స్పర్శతో ఆనారోగ్యం మాయం!
అమ్మ ప్రేమతో పాడే లాలి,
సుఖ నిద్ర తెచ్చి తీరాలి!
అమ్మ ప్రేమ పూలజల్లు,
ఆనందాల హరివిల్లు!
అమ్మ ప్రేమ నిండిన ఇల్లే,
ఆత్మీయతకు పుట్టినిల్లు!
అమ్మ ప్రేమ అష్టమిచంద్రుడు,
ప్రకాశించే ఆకాశము!
అమ్మ ఉన్నా లేకున్నా ,

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి