****
"అవ్వా! పెండ్లిలల్ల సూడాలె ఒక్కొక్కలి శకలన్ని,పెగ్గెతనం,శానతనాల్ని. సయిమం వొచ్చిందని సూపిచ్చుకుంటరు మల్ల తొవ్వపొంటి ఎప్పుడు సుత యాది మర్వకుండా. గట్లెందుకు శేత్తరో ఏమో మల్ల మల్ల అవసర పడమా ఏంది?
" ఏంది శెల్లే! ఏమైంది దేనికన్న మన్సు నొచ్చుకున్నవా ఏంది? లగ్గమంటెనే అటీటు ఓ వొందమంది శేతులన్న,మాటలన్న కలుత్తయి. శెప్పేకాడ,సేశేకాడ,సవరిచ్చే కాడ,అరుసుకునే తాన గిట్ల తలొక్క మాట,నపరొక్క శేత ఉంటనే ఉంటది.గింతకీ ఏమైంది శెల్లే!"
"అవ్వా!మొన్న శిన్నన్న బిడ్డ లగ్గానికి ఎల్లినం గద.ఇంటాడబిడ్డనని నాకు శెప్పిన పన్లు సగబెట్టబోతుంటే,యాడ్నో దూరపు సుట్టిర్కం.శాన్నాల్లకొచ్చిందిలే. యాడ్నో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ఒకటే టైలు జేసుడు.అన్నింటి కాడ గామె మాటనే శెల్లుబాటు శేసుడు.సుడిగాలి లెక్క అందర్నీ ఉరికిచ్చుడే ఉరికిచ్చుడు. గామేంది గట్ల జేత్తదని ఒక్క తీర్గ గుసగుసలు తెల్సా అవ్వా! నాకు సుత మరీ అతి జేత్తున్నట్టు అన్పిచ్చింది.
"అవును శెల్లె! అయ్యోరు ఏం జెప్పినా శెనాల మీన తెప్పిచ్చుడు సూశి అయ్యోరు సుత పన్లన్ని గా సుక్కమ్మక్కకే శెప్పుడు. గిక్కడున్నోళ్ళు సుత పిల్లంగోయి ఊదుడికి నాగుంబాం తల్కాయ ఊపినట్టు శెటా శెటా గా అక్క ఏం జెప్తె గజ్జేసుడు కండ్లారా సూశిన శెల్లే! అక్క మస్తు ఉషారు పిట్ట అన్పిచ్చింది."
" ఏమో అవ్వా! నాకైతే గామె పెత్తనమేంది? గక్కడెక్కన్నించో వొచ్చి. అక్కడున్నోళ్ళం సుత తలొక్క పని అందుకుంటనే ఉన్నం గద."
" శెల్లే!గట్ల పెత్తనం శేయడంల నేను సూశింది ఏంటంటే లగ్గ మూర్తానికి జీలకర్రబెల్లం,తాళి సయిమానికి కట్టిచ్చడం.'
"అవునవ్వోవ్! గీ నడ్మల అయిన లగ్గాలల్ల మా శిన్నన్న బిడ్డ లగ్గమే మూర్తం బెట్టిన సయిమానికి అయ్యింది. వొచ్చినోళ్ళంత గీళ్ళ ఆలకం జూసి గిట్ల సయిమానికి అయితదనుకోలేదు.బలే జేశిండ్రే అనుకుంటుంటే యిన్న అవ్వా!"
"అగ్గో నీ నోటి మీంచే అన్నవా లేదా! గట్ల సుక్కమక్క తొందరబెట్టబట్టే లగ్గం సక్కగ అయింది. గా తాళి మూర్తం అయినంక అందర్నీ పేరు పేర్న పల్కరిచ్చింది. ఆలు నుంచి పెండ్లి పిల్ల,పెండ్లి కొడుకు లగ్గమై ఎల్లే దనుక తొందరజేసింది.తనకి పన్లల్ల సాయపడ్డ అందర్నీ మెచ్చుకొని, ఎల్లొత్తనని జెప్పి పోయింది."
"అవునవ్వా! గా ఇంక శానమందే శెయ్యి గడిగి అట్నుంచటే ఎల్లిపోయిండ్రు. వొదినె,ఎంత ఉండమన్న ఉండనే లేదు.
గదే శెల్లే! " ఆలుమొగలు ఒక్కటయ్యేదాకనే అందరవస్రం" ఆటెంక ఏముంది.మూన్నిద్దర్లని, పదారొద్దుల పండుగని, వొడిబియ్యం వొండాలని గిట్ల అటీటు దెగ్గరోళ్ళు కల్శి శేస్కుంటరు. గందుకే పెద్దోళ్ళు "ఆల్మొగలు ఒక్కటయ్యేదాకనే అందరవస్రం" అంటుంటరు.గందుకే సుక్కమక్క, మిలిగిన సుట్టాలు పక్కాలు లగ్గం జూసి ఎల్లి పోయిండ్రు.
"అవునవ్వా! నువ్వు శెప్పింది. నిజవేఁ... గా సయిమాల్లో అదో ఇదో అన్కుంటనే అందరు కల్శి కార్యాన్ని గట్టెక్కిత్తరు.ఆటెంక ఎవలికుండే పన్లు ఆళ్ళకే ఉంటయి.గస్మంటివి మన్సుల బెట్టుకోవద్దని గిప్పుడు తెల్శిందవ్వా!"
గదండీ సంగతీ! "ఆలుమగలు ఒక్కటయ్యేదాకనే అందరి అవసరం" అంటే గిదే మరి"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి