అంబరీషుడు దేశాలు గ్రామాలు
నగరములు వనములు అన్ని తిరుగుతూ
ఆశ్రమములు అడవులు అన్నీ తిరుగుతూ
యజ్ఞ పశువుకై అన్వేషిస్థూ ఆ రాజు
బృగతుంగ పర్వతమునకు చేరినాడు
అచట భార్యపుత్రులతో సుకీనుడైయున్న
బూచిక మహర్షిని దర్శించినాడు
ఆ మహర్షికి రాజు నమస్కరించినాడు
ఓ మహానుభావా నీకు లక్ష గోవులనిస్తాను
నీ పుత్రుని యజ్ఞపశువుగా నాకివ్వుము
అంబరీషుని ప్రార్థన ఆలకించిన ముని
నా పెద్ద కుమారుని నేను అమ్మను
నా భర్త పెద్ద కుమారుని అమ్మజాలడు
నేను చిన్న కుమారుని వదిలి ఉండలేను
నడిమి వాడు శునశ్రేవుడు వారిని అమ్మరు
నన్ను వారమ్మినట్టుగా భావిస్తున్నాను
రాజా యజ్ఞ పశువుగా నన్ను గొనిపొమ్ము
మహారాజు బూచీకునకు లక్ష గోవులిచ్చి
సంతోషంతో శునశ్శేవుని స్వీకరించి
శీఘ్రముగా తనరాజ్యముబయలుదేరినాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి