సామెత -228: ఆవునిచ్చి పల్పుతాడు దాశినట్టు
*****
"మాగనే ఉంది సంబడం. 'ఎన్కనించి ఏన్గులు బోతే దిక్కులేదు గని ముందు నుంచి వోమ్పూస పోతె ఊకోను' అన్నడంట ఎన్కటికెవలో...శెయ్యాల్శిందంత శేసినం.ఇయ్యాల్శిందంత ఇచ్చినం.అంతంత బెట్టి గింతంత కాడ ఎల్తిపడ్తే ఏమన్న బావుంటదా నువ్వే శెప్పవ్వా! అస్సలింటల్లె .'వొర్లి వొర్లి ఆడే పాయె- వొండకదిని ఈడే పాయె అన్నట్టుంది' ఈయిన యవ్వారం."
"ఏంది శెల్లె ఏమైంది? మర్ధినేమో మాగనే జబురుకుంటున్నవ్."
"ఆఁ ఏముందవ్వా! గా వొత్తువెంత దాని బిశాదెంత? ఎందుకియ్యాలె అన్కుంట బర్జెనిగె పట్టు బట్టిండు. గా సూశేటోళ్ళు ఏమన్కుంటరు. గింత ఎల్తి మొకాలా గీళ్ళు అన్కోరా ఏంది?"
"అస్లేందో శెప్పకుండ గిన్ని జెప్తున్నవ్?యిష్యమేందో పురాగ దెల్వకుండ నేనేం మాట్లాడాలే శెల్లే!"
"ఏమో అవ్వా! మీ మర్ది శెకలకి ఉన్న తెల్వి కాత్త ఉట్టెక్కుతంది.బిడ్డ లగ్గం అంగరంగ వైభోగంగా జేశినమా! పెట్టుబోతల కాడ గాళ్ళంత నోరెళ్ళబెట్టేతట్టు మర్యాదలు తక్వ గాకుండా జేసినమా! బిడ్డ ఆడబిడ్డ నిద్రలకి బోయినప్పుడు "వొదినే! పట్టుశీరలు, బట్టలు కొన్నతాన మంచి మంచి బియాగులు, సూటు కేసులు ఇచ్చిండ్రని మా యన్న జెప్పిండు.గండ్ల నా కోటి యియ్యరాదు.యాడికన్న ఊల్ల దౌరాకి పట్కబోవడానికి పనికొత్తది" అందంట." మన పొల్లకేమో అయ్యతాన అతి గావురమాయె.గదేదో నా శెవులేత్తే గింత దన్క వొచ్చేదే గాదు.మీ మర్దేమో "గవి ఎక్వైతే ఎవలికన్న దానమన్న యిత్తగని గాళ్ళకి అస్సలు యియ్యన్ గాక యియ్యన్ పో అంటుండవ్వా!
"ఓష్నీ అస్లిషయం గిదా శెల్లే! మర్ది ముచ్చెటి ఎవలన్న యింటే అట్లిట్ల నవ్వరు. గా పెండ్లి పిల్గాని శెల్లె శిన్న పొల్లగా.. సుట్టాల మార్గం పోయేతందుకు గస్మంటి అల్కటి బియాగు మంచిగుంటదని అన్కుందేమో..."
మర్ది శెకలు సూత్తుంటే "ఆవునిచ్చి పల్పుతాడు దాశినట్టుంది" ఒక్కతే పొల్లని లచ్చల లచ్చలు గాళ్ళు అడ్గక మున్పే ఇస్తిరి. వొంటి నిండ నగలే బెట్టుకుంట్రి. గదేదో అడిగిందని గట్ల గుస్సైతె ఎట్ల శెల్లే? ఏడి మా మర్దిని బిల్వు."
" ఏందయ్యా! మర్దీ! నీ యియ్యంకుడు,ఈపరాలు అడ్గితే గాల్లేంది కక్కుర్తి గాళ్ళు అన్కోవాలె.గని అడిగింది శిన్న పొల్ల. గీ యిష్యం వాళ్ళకి తెలిత్తే గట్లడిగి పర్వు తీత్తవాని గాల్లే గా పొల్లని నాల్గు దొబ్బులు బెడ్తరు. అల్లునికి తెలిత్తే గదెంత గా దాని బాగ్గెమెంత యిత్తేమైతదని మన పొల్లనో మాటంటే మనవేఁ బాదవడాలి.ఇంటున్నవానయ్య!"
అవునొదినే! గియ్యన్ని నువ్వన్నదన్క మన్సుకు బట్టలే.ఇంగ నయ్యం గీ శిన్న దాని కాడ మనస్పర్తలొచ్చేటివి. ఒక్కటి గాదు రొండు గాదు. ఉన్నయన్ని ఇచ్చిబంపుత.గాల్లే ఏమన్న జేస్కోని."
గట్లుండాలయ్యా! ఆవస్మంటి మన లచ్మినే గాల్ల శేతుల బెడ్తిమి. పల్పుతాడస్మంటి శిన్న శిన్నవి ఇయ్యక పోతే గాళ్ళు కొనుక్కోలేరా ఏంది?"
"అవ్వా! గట్ల నువ్వు జెప్పినంక మీ మర్దికి సమజయ్యింది.గిట్ల మంచి శెబర శెప్పే నీ అస్మంటోళ్ళు ఉండాలే. పోయొత్తం."
"గాల్లిద్దరు పోతున్న దిక్కు గప్పటి దాక అన్కుంది యాదికొచ్చి నవ్వుకుంట సూడబట్టింది అవ్వ.
"గదండీ సంగతి! "ఆవునిచ్చి పల్పుతాడు దాశినట్టుంది "అంటే గిదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి