అన్నీ పూలదారులే ఉండవు
ఎత్తు పల్లాలు ఎగుడు దిగుళ్ళు
ఎవరి ప్రాప్తం మేరకు వారికి
ఎపుడూ ఎదురవుతాయి!
దారి కనపడే రాతలు కొన్ని
దారి చేసుకోవాల్సినవి కొన్ని
దారిలో తప్పని ముళ్ళు
దారికి అడ్డుగా బండలు కొందరికి!
కనపడుతున్నా దరి చేరని..
పరుగులు తీసినా తరగని దూరం
చేతికి అందే దూరంలో వున్నా
చేయి చాచలేని దుస్థితి!
పతనం అంచున నిలబడి కూడా
పయనం మొదలెట్టాలి
ప్రయత్నం ఎన్ని సార్లు చేసినా
ప్రతిసారీ మెరుగు పడాలి.
విజయం కానుక కాదు
కనికరం తో ఇచ్చేయడానికి
నీతో నువ్వే యుద్ధం చేసి
సాధించుకోవాలి..
ప్రతి ఉదయం ఒక వరం
ప్రతి దినం ఒక అవకాశం
ప్రతి క్షణం ఒకటే ధ్యేయం
ప్రతి వేకువ ఒక ధైర్యం!
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి