తృప్తి : - - యామిజాల జగదీశ్
 ఉన్నంతలో తృప్తిగా ఉండటం, సంతోషంగా ఉండటం అనేది అనుకున్నంత సులభం కాదు.‌ ఎందుకంటే మనసు కోతి లాంటిదని పెద్దలు ఉట్టినే చెప్పిన మాట కాదు.‌ మనసుని నియంత్రించుకోవాలి తప్ప మనసు మనపై ఆధిపత్యం చెలాయిస్తే ఇంకా తీరం చేసినట్లే.‌ సంతోషం అనేది ఇంకెక్కడో ఉందనుకుని దాని కోసం వెతుకుతుంటాం.‌ పరుగులుపెడతాం.‌ కానీ సంతోషం అనేది మనలోనే ఉంది. దానిని తెలుసుకుని నడుచుకుంటే సంతోషం మనదే.‌ దాన్ని బయటి శక్తులేవీ అడ్డుకోలేవు.‌ ఎవర్నో ఒకర్ని తోడనుకున్నప్పుడు నమ్మకం అనేది కీలక పాత్ర పోషించాలి. అంతేతప్ప పైపైన ఏవో నాలుగు చెప్పి తోడున్నామనుకుంటే మనల్ని మనమే మోసం చేసుకోవడమే అవుతుంది. తోడుకు సందర్భోచిత పదాలు
చేదోడు - వాదోడు. కష్టసుఖాల్లో సహాయం చేయడం.
తోడు నీడ : ఎల్లప్పుడూ వెంటే ఉండేవాడు.
తృప్తి అంటే మనసు ప్రశాంతంగా, ఉన్నదానితో సంతోషంగా ఉండే స్థితి. ఇది సంపదలో కాకుండా, మనం చేసే పనులలో, నిబద్ధతలో, ఇతరులకు సహాయం చేయడం వల్ల కలిగే ఆనందంలో ఉంటుంది. తృప్తి గురించి 
నిజమైన అర్థం : అహంభావం లేని జీవితం. ఇతరులను సంతోషపెట్టడం తృప్తికి మూలం.
 
దేవుడు మనకు అవసరమైనది ఇస్తాడనే నమ్మకంతో, ఫలితాన్ని ఆశించకుండా చేసే కర్మల వల్ల శాశ్వత తృప్తి కలుగుతుంది.
తృప్తి అనేది టెన్షన్ తగ్గించి, మనసుని తేలిక చేస్తుంది. తృప్తికి వ్యతిరేక పదం అసంతృప్తి. 
తృప్తి లేదా సంతృప్తి అనేది లేకుంటే జీవితం దుర్లభమే. అసంతృప్తి లేదా ఉన్నదానితో తృప్తి పడకపోవటంలో నిలకడ ఉండదు. 
మనం చేసిన పని ఇతరులకు ఉపయోగపడితే నిజమైన ఆనందం కలుగుతుంది. దానిని మాటల్లో చెప్పలేం. నిజమైన తృప్తి సంపదలోనో లేదా అధికారంలోనో కాకుండా మనం చేసిన పనిలో ఉండాలి.
మనసు ప్రశాంతంగా, పాజిటివ్‌గా అయ్యే సంఘటనలు సంతోషాన్నిస్తాయి. 

కామెంట్‌లు