కామదేనువును తీసుకొని పోవుటకై విశ్వామిత్రుడు ప్రయత్నించుట :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
ఆ కామధేనువును విశ్వామిత్రుడు 
సైనిక బలముతో తీసుకొని పోగా 
అది కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది 
వశిష్టుడు నన్ను ఇతనికి పరిత్యజించెనా

వశిష్టునికి నాపై ప్రీతి ఎక్కువ 
అతనిని నేను ఎలా వదిలి పోతాను 
సైనికులతో తిరగబడి కామదేనువు
వశిష్టుని ముందుకొచ్చి నిలిచినది 

కామదేను ఎక్కువగా దుఃఖిస్తూ 
ఓ బ్రాహ్మణోత్తమా నన్నతనికి యిస్తివా
లేదు తల్లి అతను గర్వభలముతో 
నిన్ను తీసుకెళ్ళు చున్నాడు 

అతని సైన్యము గెలిచి బలము లేదు 
నీవు ఆ సైన్యాన్ని సృష్టించు దేవి 
అతని మాటలు విన్న కామదేనువు 
బలమైన సైన్యాన్ని సృష్టించెనట 

విశ్వామిత్రుడు అది చూసి కోపంతో 
అతని ఆయుధశక్తితో  అంతమొందించాడు
వశిష్టుడది చూసి భీతి చెందినాడు 
వశిష్ట భయపడకు నీవని గోవు పలుకును


కామెంట్‌లు