అమృతం కొరకై దేవాసురుల సంగ్రామము: - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
వేయ్యివత్సరములు సంద్రము చిలుకగా 
వాసుకి అను పాము విషం కక్కుచూ 
తన కోరలతో శిలను కాటు వేయుచు 
భయంకరమైన హాలాహలం చిమ్ముచుండెనను

అది చూసి దేవతలు శివునికై మొరపెట్టుకున్నారు 
దేవదేవుడు పరమశివుడు దర్శనమిచ్చి 
ఆ విషం మింగి కంఠములో ఆపినాడు 
శివుడిని కళ్ళారా చూసినాడు శ్రీహరి 

ఓ ఆదిదేవ ఈ క్షీరం నుండి వచ్చిన మొదటిది 
నీకే కానుకగా ఇస్తాము స్వామి 
శ్రీహరి శివునితో అలా పలికి అదృశ్యమైనాడు
కాలకూట విషంతో శివుడు వెళ్ళినాడు 

మందర పర్వతము లోతుకు దిగుబడగా
అప్పుడు శ్రీహరి కూర్మ రూపము ధరించి 
పర్వతము కింద చేరి తాను ఒకడై చిలికగా
మహా పురుషుడు క్షీరం నుండి ఉద్భవించెను

అతని పేరు ధన్వంతరి అతనితోపాటు 
అందమైన అప్సరసలు ఆవిర్భవించినారు 
వరుణ్ కూతురు మద్యదేవత చక్కని చుక్క 
సముద్రం నుండి వెలపలకు వచ్చింది 


కామెంట్‌లు