కపిలుని క్రోధాగ్నికి సగరుని పుత్రులు భస్మమగుట: - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
దేవతల మొరను ఆలకించిన బ్రహ్మ 
ఈ భూమండలం అంతా సర్వశక్తుడైన 
ఆ శ్రీ మహా విష్ణువే కపిల మహర్షిగా 
అవతరించి ఈ భూభారాన్ని మోస్తున్నాడు 
అతని కోపానికి సగర పుత్రులు భస్మమవుతారు

బ్రహ్మ దేవుని మాటలు విన్న దేవతలు 
మిక్కిలి సంతోషించి వెళ్ళిపోయినారు
సగర పుత్రులు భూమిని తవ్వుచుండగా 
ఒక పిడుగుపాటు శబ్దము వినిపించింది 

ఆ మహాద్వానికి భయపడి సగర పుత్రులు 
తండ్రి వద్దకు బయలుదేరి వెళ్ళినారు 
సమస్త భూమండలము గాలించినాము 
ఎక్కడ ఆశ్వము జాడ లేదు తండ్రి 

రక్తసిక్తం లై వచ్చిన పుత్రులను చూసి 
సగరుడు వారిలో ధైర్యము నింపుతాడు
మీరుమరల భూమండలమంతా శోధించి 

అశ్వాన్ని దానిని అపహరించిన వాడిని 
పట్టుకొని విజయవంతులై తిరిగి రండు
తండ్రి మాట విన్న రాజపుత్రులు 
మళ్లీ పాతళ లోకమునకు వెళ్లారు 


కామెంట్‌లు