రక్త సంబంధాల బంధా లతో...
కల కల లాడితేనే అది కుటుంబం....!
సకల మానవ సంబంధాల కూ పునాది...
కుటుంబ బంధాలే...!
భార్య, భర్త... కొడుకు, కూ తురు...!
అన్న, చెల్లి... అక్క, తమ్ముడు...
తాతలు , నానమ్మ, అమ్మమ్మలు...!!
కలిసి ఉన్న కుటుంబం లోనే...
కలదు సుఖం... ఇది నిజం...!
ఇదే పరిమళించే మానవత్వ0...!!
కాల మాన పరిస్థితులు మనుషులను దూరం చేసినా...
మనసులు మమేకమై...
కష్ట, సుఖాలలో...
కలుసుకుంటేనే అండ, దండగ నిలిస్తేనే అది కుటుంబం...!!
ఇదే మన భారతీయ సంస్కృతి వైశిష్ట్యం...!
కాబట్టే కాగలిగింది ...
ప్రపంచానికే ఆదర్శ0 !!
ఆత్మీ యతతో... కుటుంబాలు వృద్ది చెందా లి...
మంచి మానవ సమాజాలు విస్తరిల్లాలి...
శా0తి సౌఖ్యాలతో...
ఈ భూగోళ0 పరిఢవిల్లాలి...!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి