*మౌ నం గా....! *:- కోరాడ నరసింహా రావు
అమ్మ.... అమ్మ ప్రేమ... అమ్మ సేవ.... అమ్మ త్యాగం....! 
  రాసి... రాసి.... పదాలు కరువై పోయాయి...! 
  అక్ష రా లన్నీ ఐ పోయాయి...!! 

అమ్మను నిర్వచించాలంటే.... 
 అమ్మ తప్ప మరో ఉపమానము కనిపించటం లేదు...! 
  అమ్మకు అమ్మే ఉపమానం...! 
  అమ్మకు అమ్మే ఉపమేయం...!! 
  సింపుల్ గా... అమ్మంటే మనకు జన్మనిచ్చిన దైవం అనే స్తే సరిపోదుగా...! 
 అమ్మ ఔన్నత్యాన్ని వర్ణించటం ఆ బ్రహ్మ తరం కూడా కాదు...!! 
అమ్మ ప్రేమను... ఆ వాత్సల్యాన్ని... ఆ మమకారాన్ని ,ఆ సేవను ఆ త్యాగాన్ని వర్ణించ భా ష చాలదు...! 
  మాట ల్లేవ్...! 
 ఆ మాధుర్యాన్ని అనుభ వించి , ఆస్వాదించి... అనుభూతించి...మౌనం గా ఆనందించటం తప్ప....!! 
      ******

కామెంట్‌లు