వేసవి తాపం..!: - ఈగాపాటిరంజాన్ -భద్రాద్రి కొత్తగూడెం.
మే మాసంలో "మే పుష్పం"చిగురించిన్నట్టు..
వేసవితాపానికి ఊరే,
చల్లటి ఊట బావులు!
తడి ఆరుతున్న గొంతులకు..
దాహంతీర్చే తీపిగుర్తులు!
శీతల పానీయాలు,
సమ్మర్ అయిన సంబరమైన..
విందు అయిన విషాదమైన,
కడుపు సళ్ళగా చేస్తుంటాయి!
మనసుకు,హాయినిస్తాయి!
ఆగడుకొడుతున్న వేడిగాళ్ళులకు...
పండ్లరసాలను శీతలపెట్టెలో,
చల్లపరచి తాగుతుండే!
ఆటకు పోయివచ్చిన,మాకు 
మా అమ్మ..
చల్లటి కుండనీళ్ళతో,నిమ్మరసం...
చేసి ఇచ్చిన వేసవి శీతల పానీయాలు రుచులు! 
ఇప్పటికీ, నేటి ఎండాతాపానికి
ఎండుతున్న గొంతుకలుకు...
చల్లటి సెలయేర్లు అవుతున్నాయి 
శీతల పానీయాలు...!!


కామెంట్‌లు