త్యాగమయి...!!- యెనుముల వేణుగోపాల్ రావు - అమలాపురం.
పురిటి నొప్పుల సైతం 
పంటి బిగువున పెట్టి !
ప్రాణ త్యాగానికి నెరవక
నాకు జన్మ నిచ్చావు !

బుడి బుడి అడుగులు 
చూసి మురిసిపోయావు !
అమ్మా అన్న పిలుపుకు
పరవశించిపోయావు !

నీ ఆకలి ప్రక్కన పెట్టి 
ప్రేమానంతా రంగరించి_నాకు
గోరు ముద్దలు తినిపించావు !
స్వర్గమంటే ఇలా ఉంటుందని
అమ్మఒడి రుచి చూపించావు !

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని
సూక్తులు బోధించావు!
గురువువై , మార్గదర్శివై ,
ముందుకు నడిపించావు !
నాఎదుగుదల చూసి
లోలోన మురిసి పోయావు!

ఇంత చేసిన నీకు
ఏమి ఇవ్వగలనమ్మా ,
నీ తీపి జ్ఞాపకాలు
మననం చేసుకోవడం తప్ప !!
                   ***

కామెంట్‌లు