కంటికి హాయినీ, మనసుకు ఆనందాన్ని పంచే పుష్పాలలో వైద్య గుణాలు దాగున్నాయంటే ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ నిజం. పూవుల సువాసనలు మానసిక, శారీరక సమస్యలను దూరం చేస్తాయి.
గులాబీలో ఎన్ని రకాలున్నా అన్నీ ఔషధగుణాలు కలిగినవే. ప్రేమైకభావన కలిగించడంలో ఈ పూలు ముందుంటాయి. అంతేగాక ఒత్తిడిని తగ్గించి నిద్రలేమిని దూరం చేస్తాయి. ఆ సువాసన ఈటింగ్ డిజార్డర్స్ ని సరిచేస్తుంది. మల్లెపూవు తీగల నిండి విరిసిన పూలు ఆ సువాసనల్ని గుండెల నిండా పీల్చితే చాలు, మనసు నిండా ఆత్మవిశ్వాసం నిండుతుంది. డిప్రెషన్ రమ్మన్నా రాదు. చర్మసమస్యలను నిరోధించడంలో మల్లెపూవు ముందుంటుంది.
ఒళ్లునొప్పులు, తిమ్మిర్లను కూడా మల్లె తగ్గిస్తుంది. గెరానియం తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా అప్పుడప్పుడూ మనసుకు చికాకుగా అనిపిస్తుంది. ఆ మానసిక స్థితిని గెరానియం పూలు చిటికెలో తగ్గిస్తాయి. నరాల్లో పెరిగే ఉద్రిక్తతను అదుపు చేసే శక్తి కూడా వాటికి ఉంటుంది. చుట్టుపక్కల గెరానియం పూల మొక్కలు ఉన్నాయంటే మనలో మానసిక ఆందోళన లేనట్లే. కాలినగాయాలు, మొటిమలు, తామర వంటి సమస్యలకు గెరానియం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. పేరు కొత్తగా ఉన్నా ఇవి నర్సరీల్లో దొరుకుతాయి. లావెండర్ మనల్ని మనం ప్రేమించగలిగితేనే జీవితాన్ని ప్రేమించగలం. ఆ ప్రయత్నంలో లావెండర్ పూలు సహకరిస్తాయి. ఆ పుష్పాలు పరిసరాల్లో ఉన్నాయంటే, గాలికి గంధం పూసినట్లే. మనిషిలోని చెడు తలపుల్ని తొలగిస్తాయి. చూడటానికి కూడా బాగుంటాయి. స్నాప్‌డ్రాగన్ ఈ పూలు బొకేల్లో ఎక్కువగా కనిపిస్తాయి. నిలువుగా ఉన్న కాండానికి చిన్నచిన్న పూలు గుత్తులుగా పూస్తాయి. ఇవి కోపం తగ్గించడంలో ముందుంటాయి. కండరాల నొప్పిని, ఒత్తిడిని అదుపు చేస్తాయి. లిల్లీ ఆఫ్ ది వ్యాలీ ప్రతి నర్సరీలో దొరికే మొక్కలే ఇవి. తలకిందులుగా వేలాడుతూ పూస్తాయి. మళ్లీ మళ్లీ చూడాలనిపించే అందం వీటి సొంతం. అందులోను విషాదం నుంచి కోలుకుంటున్నప్పుడు ఈ పూలు ఆత్మీయ నేస్తాల్లా అనిపిస్తాయి. వీటి నూనెల్ని అధిక రక్తపోటు చికిత్సలోనూ వాడతారు. పరోక్షంగా గుండెకూ బలమే. వయొలెట్ చిన్న కుండీల్లో పెంచుకోగల అందమైన మొక్క ఇది. ఆ సువాసన నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు జలుబు, దగ్గు నుంచి కాపాడుతుంది. మానసిక స్థిరత్వాన్ని అందిస్తుంది. ఫాషన్ ఫ్లవర్ రాఖీ ఆకారంలో ఉండే ఈ పూలు తీగలా అల్లుకు పోయి అందంగా పూస్తాయి. వీటి పరిమళం పాజిటివ్ ఆలోచనలను పెంచిపోషిస్తుంది. ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుంది. పాషన్ పూలు, చామంతి పూలు కలిపి టీ చేసుకుని తాగితే ఎంతటి ఆందోళన అయినా చిటికెలో మాయమవుతుంది. బంతిపూవు రోజూ చూసే పువ్వే అయినా ఇందులోని ఔషధ గుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే. బుట్టెడు తాజా బంతిపూలను గదిలో పెట్టుకుంటే చాలు మనలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. బంతిపూల సువానలకు కవిత్వాన్ని ప్రేరేపించే శక్తి కూడా ఉందంటారు. చర్మ సమస్యలకు ఇది చక్కని పరిష్కారం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి