శ్రీమద్రామాయణము బాలకాండము :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
వారు భూమిని తావ్వుతూ నుండగా 
పర్వతప్రమాణంలో నున్న
విరుపాక్షము 
అను పేరు గల దిగ్గజమును వారు చూసిరి 
దాని చుట్టూర ప్రదక్షణ చేసి లోనికి వెళ్ళినారు 

ఆ మహా గజము భూబరువును మోస్తూ 
తన తలను ఇటు అటు ఊపుతుంది 
అప్పుడు భూకంపాలు వస్తాయి 
వారు దక్షిణ దిశగా పయనించినారు 

పెద్ద శరీరముగల మహా పద్మమను దిగ్గజము 
దక్షిణ భూభారమును మోస్తుంది 
ఆ గజమునకు వారు ప్రదక్షణ చేసి 
వారు పశ్చిమ దిశగా తవ్వుతూ పయనించినారు 

సౌమనసము అను పెద్ద గజమును చూసి 
ఆ గజము చుట్టూ ప్రదక్షణ చేసి 
ఉత్తర దిశయందు తెల్లనైన భద్రము 
అను పేరు గల దిగ్గజమును చూసినారు 

వారు ఈశాన్య భూభాగాన్ని తవ్వుతూ వెళ్లారు 
కపిల నివాసము వద్దున్న అశ్వాన్ని చూశారు 
కోపముతో కపిల ముని పైకి వెళ్ళినారు 
ఆ ముని కోపంతో వారంతా భస్మమైపోయినారు 


కామెంట్‌లు