వశిష్ట ఆశ్రమమును ధ్వంసం గావించుట: - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
తన వందమంది కుమారులతో పాటు 
సప్తబలంలను నశించిపోవుట చూసి 
విశ్వామిత్రుడు చింతాక్రాంతుడాయి
కోరలు తీసిన పాము వలె శక్తిహీనుడైనాడు

రెక్కలు తేన పక్షి వలే దీనుడైనాడు 
రాహుగ్రస్త సూర్యుని వలె తేజ హీనుడైనాడు 
అతని గర్వమంతయు అనిగి పోయి 
అతనిలో నిర్వేదము ఆవరించెను 

విశ్వామిత్రుడు హిమ పర్వతములు చేరి 
పరామ శివుని గూర్చి తపస్సు చేసినాడు 
శివుడు విశ్వామిత్రునికి దర్శనమిచ్చి
మనసులోని కోరికను కోరుమన్నాడు 

ధనుర్విద్యను నాకు ప్రసాదించు శివా
దేవతలు, దానవులు, మహర్షులు 
గంధర్వులు, యక్షులు రాక్షసుల 
అస్త్రములన్ని నా వశం చేయుము

దివ్యస్త్రములు సాధించి గర్వముతో మహర్షీ 
వశిష్ట ఆశ్రమమును  ద్వంశముచేసయగా 
వశిష్ఠుడు పట్టరాని కోపముతో 
తన బ్రహ్మదండమును చేబూని నిలిచినాడు 


కామెంట్‌లు