ఇక్ష్వాక మహారాజు భార్య అలంబుస
ఆమె పుత్రుని పేరు విశాలుడు
అతని పేరుతో విశాల నగరమంటారు
విశాలిని కుమారుడు హేమచంద్రుడు
హేమచంద్రుని పుత్రుడు సుచంద్రుడు
సుచంద్రుని కుమారుడు ధూమ్రాశ్వుడూ
అతని కుమారుడు సంజయుడు
సంజయ్ ని సుతుడు సహదేవుడు
సహదేవుని పుత్రుడు కుశాశ్వుడు
అతని కుమారుడు సోమ దత్తుడు
సోమ దత్తుని పుత్రుడు కాకుత్ స్తుడు
అతని కుమారుడు సుమతి
ఇప్పుడీనగరము పాలించువాడు సుమతి
విశాల నగరమును పాలించు రాజులందరూ
ఇక్ష్వాక మహారాజు అనుగ్రహముతో
పరక్రమవంతులు పరమ ధార్మికులు
ఓ రామ ఈరోజు ఇక్కడనే గడిపి
రేపు ఉదయాన్నే జనకమహారాజును
దర్శించుకొనుటకు వెళ్దాము ఇక సేద తీరండి
విశ్వామిత్రునికి రాముడు అంజలి ఘటించినాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి