ఆరాట రాజకీయాలు: - కవిమిత్ర, సాహిత్య రత్మ-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.(పుష్యమి)-విశాఖపట్నం
ప్రజాప్రతినిధులు ప్రజాహితమే
సమాజాభివృద్ధి కోసమే పాటు పడే రోజులు ఆనాడు
నేడు స్వప్రయోజనానికే ఉచితపథకాలు
ఆకర్షణీయమైన ప్రలోభాలు ప్రవేశపెట్టి
ప్రజలను సోమరిపోతులుగా చేసి తమ అభివృద్ధి
సమాజాభివృద్ధి అనడం సర్వవిధితం
స్వలాభం లేనిదే ఏ పని చేయని రాజకీయనాయకులు
పదవి కోసం కోట్లు ఖర్చు పెట్టి
ప్రజాశ్రేయస్సే మా లక్ష్యం అని
తమ సంపాదన కోసమే పాటు పడటం
నైతిక విలువలు సంస్కారాన్ని వదలి
పదవి ధనార్జన  కోసమే
అని 
పదవి కోసమే ఆరాటం తప్ప ప్రజాహితం పట్టించుకునే రాజకీయనాయకులే
ఆనాడు దేశం కోసం తమ సర్వస్వం అర్పించారు నాయకులు
నేడు పదవి కాపాడుకోవడం కోసం కోట్లు ఖర్చు పెడుతు
మానవత్వాన్ని మరిచే నాయకులు
ఓ యువతా అభివృద్ధి  మీ భుజస్కంధాలపై ఉన్నది
యుక్తాయుక్త విచక్షణతో సరి అయిన నాయకుని ఎన్నుకోండి
అవినీతిని  ఎదుర్కొనండి
రాజకీయ ఆర్భాటాల కన్న
ప్రజాహితమే అభివృద్ధి అని  పోరాడండి..!!
............... ............. 


కామెంట్‌లు