త్రిశంకుడు విశ్వామిత్రుని మొరపెట్టుకొనుట : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
త్రిశంకుప్రభువు తన నగరము జేరి
చింతిస్తూ ఆ రాత్రి గడిపి నంతనే 
చండాల రూపమును పొందినాడు 
అతని రూపతడే చూసుకోలేకపోయాడు 

అతడు కట్టుకున్న పితాంబరం 
అతని ఒళ్ళు కూడా నల్లగా మారింది 
ఒళ్లంతా కరుకుదనం పొందెను 
కేశరములు కురుచగ నయ్యెను

అతని ఆభరణములు అన్ని ఇనుముగా 
అతడు స్మశానమాలలు బూడిదరించెను 
అతనిని చూసిన మంత్రులు బీతితో 
పరుగు తీయగా జనులంతా వెళ్ళినారు 

ఈ బాధ తట్టుకోలేక త్రిశంకుడు 
విశ్వామిత్రుని ఆశ్రయించినాడు 
మహర్షితో తన శాపము గూర్చి తెలిపి
మీరే నన్నుదుకోమని కోరినాడు 

నేను దురదృష్టవంతుడను నన్ను కాపాడు 
నా దైవ కార్యము నెరవేరునట్లు చూడు 
ఇక నేను ఎవరిని ఆశ్రయించను స్వామి
త్రిశంకుడు కాపాడుమని వేడుకుంటాడు


కామెంట్‌లు